Income Tax Raids: ఇండియాలోనే అతిపెద్ద మోటార్ సైకిల్ తయారిదారీ కంపెనీ అయిన హీరో మోటాకార్ప్ (Hero MotoCorp) సీఈవో, ఎండీ పవన్ ముంజాల్ (Pawan Munjal) ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది. గురుగ్రామ్‌లోని ముంజాల్ ఇళ్లు, కార్యాలయాల్లో బుధవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ముంజల్‌తోపాటు హీరో (Hero) సంస్థలోని ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లల్లో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారని తెలుస్తోంది. అయితే ఐటీ దాడులకు సంబంధించి హీరో కంపెనీ కానీ, ఆదాయపు పన్ను శాఖ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. హీరో మోటోకార్ప్.. దేశంలో అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ. ఇది ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, మధ్య అమెరికాలోని 40 దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ దాడుల్లో లభించిన వివిధ పత్రాలను ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు పరిశీలిస్తున్నారు.
కాగా, ఇటీవల ఐటీ శాఖ అధికారులు ఢిల్లీ రాజధాని ప్రాంతం, చండీగఢ్, లూథియానా, లక్నో, ఇండోర్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన 45 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరిగాయి. అక్కడ లభించిన సమాచారం ఆధారంగా పవన్ సహా కంపెనీకి సంబంధించి అధికారుల ఇళ్లల్లో దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Income Tax department conducting searches at multiple premises of Hero Motocorp. The office and residence of promoter Pawan Munjal and premises linked to the top officials of the company are covered in this search. More details awaited: Sources
— ANI (@ANI) March 23, 2022
ఇవి కూడా చదవండి: