Murder Case on CBI: సీబీఐకి బిగ్ షాక్.. మర్డర్ కేసు నమోదుచేసిన రాష్ట్ర పోలీసులు.. అసలేం జరిగిందంటే..

Bogtui accused death: అత్యంత కీలకమైన కేసులను దర్యాప్తు చేసే సీబీఐపై పశ్చిమబెంగాల్లో మర్డర్ కేసు నమోదు అయింది. ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న లలన్‌షేక్ సీబీఐ కస్టడీలో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడు.

Murder Case on CBI: సీబీఐకి బిగ్ షాక్.. మర్డర్ కేసు నమోదుచేసిన రాష్ట్ర పోలీసులు.. అసలేం జరిగిందంటే..
West Bengal Cbi

Updated on: Dec 14, 2022 | 1:12 PM

అత్యంత కీలకమైన కేసులను దర్యాప్తు చేసే సీబీఐపై పశ్చిమబెంగాల్లో మర్డర్ కేసు నమోదు అయింది. ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న లలన్‌షేక్ సీబీఐ కస్టడీలో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సీబీఐ అధికారులపై స్థానిక పోలీసులు మర్డర్ కేసును నమోదు చేశారు.

ఈ ఏడాది ప్రారంభంలో బీర్భమ్ జిల్లాలోని బగ్తుయ్ గ్రామంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మార్చి 21న బర్సోల్ గ్రామానికి చెందిన పంచాయతీ ఉపాధ్యక్షుడు,తృణమూల్ కాంగ్రెస్ నేత బాద్‌షేక్‌ను గుర్తి తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దీంతో అల్లర్లు చెలరేగాయి. గుర్తు తెలియని వ్యక్తులు బగ్తుయ్ గ్రామంలో ఇళ్లకు నిప్పు పెట్టడంతో 8మంది కాలి బూడిదయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలున్నారు. గాయాలతో మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు.

ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న లలన్‌షేక్ డిసెంబర్ 4న జార్ఖండ్లో పట్టుబడ్డాడు. అనంతరం లలన్‌షేక్‌ను బీర్బం జిల్లాలోని సీబీఐ తాత్కాలిక క్యాంపులో ఉంచింది. సోమవారం సీబీఐ కస్టడీలో ఉండగానే లలన్‌షేక్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో నిందితుడిని హత్యచేశారంటూ రాష్ట్ర పోలీసులు సీబీఐ సీనియర్ అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్‌ను సీబీఐ హైకోర్టులో సవాలుచేసే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..