Viral Video: పాఠశాలకు లేట్ వచ్చిందనే కారణంలో ఉపాధ్యాయురాలిపై చెప్పులతో దాడి చేశాడు స్కూల్ ప్రిన్సిపల్. అడ్డుకున్న వారిని పక్కను నెట్టిమరీ కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండా.. అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. యూపీ లఖీంపూర్ ఖేరీలోని మహేంగు ఖేరా గ్రామంలోని ప్రభుత్వం పాఠశాలలో అజిత్ వర్మ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాడు. అయితే, ఇదే స్కూల్‌లో పని చేస్తున్న ఓ మహిళా టీచర్ పాఠశాలకు ఆలస్యంగా వచ్చింది. దాంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్.. స్కూల్‌కు లేట్‌గా ఎందుకు వచ్చారంటూ ఆమెను నిలదీశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. ప్రిన్సిపల్ మరింత రెచ్చిపోయాడు. కాలి షూ తీసి ఉపాధ్యాయురాలిని కొట్టాడు. అతని దాడికి షాక్ అయిన ఉపాధ్యాయురాలి.. ఆ తరువాత తాను కూడా కాలి చెప్పుతో ప్రిన్సిపల్‌ను కొట్టింది. ఈ ఘర్షణ పాఠశాలలో ఇతర ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ ఎదుటే చోటు చేసుకోగా.. కొందరు ఈ గొడవను వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది.
కాగా, ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ అధికారులు స్పందించారు ఉపాధ్యాయురాలిపై దాడికి పాల్పడిన ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలాఉంటే.. ఘర్షణపై వివరణ ఇచ్చాడు ప్రిన్సిపల్ అజిత్ వర్మ. ఉపాధ్యాయురాలు రోజూ ఆలస్యంగా వస్తుందని, కొన్నిసార్లు సంతకం చేసి వెళ్లిపోతుందని ఆరోపించాడు. ఇదే విషయంపై ఎన్నిసార్లు చెప్పినా ఆమెలో మార్పు రాలేదన్నాడు. కాగా, ఈ ఘర్షణపై ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
#WATCH | Principal of a government school in Uttar Pradesh’s Lakhimpur thrashed a female teacher with shoes
(Source: Viral video) pic.twitter.com/hCRiMuVsgV
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 24, 2022