Shocking: రెండు నెలల క్రితమే పెళ్లైంది.. 12 ముక్కలుగా నరికేసి ఏరియాకొక ముక్క విసిరేశాడు..

|

Dec 18, 2022 | 7:20 PM

జార్ఖండ్ రాష్ట్రంలో దారుణాతి దారుణం వెలుగు చూసింది. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్యకు గురైనట్లే.. జార్ఖండ్‌లోనూ ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. సాహెబ్‌గంజ్‌లో ఓ కిరాతకుడు..

Shocking: రెండు నెలల క్రితమే పెళ్లైంది.. 12 ముక్కలుగా నరికేసి ఏరియాకొక ముక్క విసిరేశాడు..
Jharkhand Woman
Follow us on

జార్ఖండ్ రాష్ట్రంలో దారుణాతి దారుణం వెలుగు చూసింది. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్యకు గురైనట్లే.. జార్ఖండ్‌లోనూ ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. సాహెబ్‌గంజ్‌లో ఓ కిరాతకుడు.. తన రెండో భార్యను అత్యంత క్రూరంగా చంపేశాడు. ఆ తరువాత ముక్కలు ముక్కలగా చేసి ఒక్కో ప్రాంతంలో ఒక్కో ముక్క పడేశాడు. ఈ భయానక, దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దిల్దార్ అన్సారీ అనేక రెండు నెలల క్రితమే రుబికా పహాడిన్ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అది కూడా ప్రేమ వివాహం.

రుబికాను ప్రేమించిన అన్సారీ.. రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. అయితే, అతనికి అప్పటికే వివాహమైంది. ఈ విషయం ఆమెకు తెలియడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే.. ఆగ్రహానికి గురైన అన్సారీ.. రుబికాను హతమార్చాడు. ఆపై తాను దొరక్కుండా ఉండేందుకు రుబికా శరీరాన్ని 12 ముక్కలుగా నరికాడు. ఆ శరీర భాగాలను ఒక్కో ప్రాంతంలో విసిరేశాడు. అయితే, రుబికా కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ సమయంలో.. ఓ అంగన్‌వాడీ కేంద్రం వెనుకాల మహిళ శరీర భాగం కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

భర్త అన్సారే.. రుబికాను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దాంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రుబికా శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యలో మరెవరి ప్రమేయం అయినా ఉందా? అనే కోణంలో కూపీ లాగుతున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఢిల్లీలో శ్రద్దాను 35 ముక్కలు చేసి అఫ్తాబ్‌ చంపేసిన ఘటన మరవకముందే ఇప్పడు జార్ఖండ్‌లో అలాంటి దారుణమే వెలుగులోకి రావడం కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..