Shocking: బాలుడి జననాంగానికి తాడు బిగించిన తోటి విద్యార్థులు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..!

దేశ రాజధాని ఢిల్లీలో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. కొందరు కీచకులు, అల్లరి మూకలు.. ఆడ, మగ అనే తేడా లేకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.

Shocking: బాలుడి జననాంగానికి తాడు బిగించిన తోటి విద్యార్థులు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..!
Ragging

Updated on: Dec 31, 2022 | 2:36 PM

దేశ రాజధాని ఢిల్లీలో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. కొందరు కీచకులు, అల్లరి మూకలు.. ఆడ, మగ అనే తేడా లేకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇందుకు నిదర్శనమైన దారుణ ఘటన ఒకటి ఢిల్లీలో వెలుగు చూసింది. కిద్వాయ్ నగర్ ప్రాంతంలోని న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్‌డిఎంసి) పాఠశాలలో కొందరు సీనియర్ విద్యార్థులు.. 8 ఏళ్ల బాలుడిని చిత్రహింసలకు గురి చేశారు. ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాలుడి పురుషాంగానికి నైలాన్ తాడు కట్టి.. వేధించారు. దాంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గత బుధవారం చోటు చేసుకోగా.. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అటల్ అద్రాష్ (8) స్కూల్‌లో చదువుతున్నాడు. అయితే, స్కూల్‌లోని కొందరు విద్యార్థులు ఆ బాలుడి జననాంగాలకు తాడు బిగించారు. తాడు పట్టి లాగుతూ నరకం చూపించాడు. అయితే, డిసెంబర్ 28వ తేదీన ఇంట్లో స్నానం చేస్తుండగా.. తల్లిదండ్రులు గుర్తించారు. దాంతో జరిగిన విషయాన్ని బాలుడు తన తల్లిదండ్రులకు తెలిపాడు.

వెంటనే వారు స్కూల్‌లో కంప్లైంట్ ఇచ్చి.. అనంతరం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రి నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరిస్థితిపై ఆరా తీశారు. అతని నుంచి వాంగ్మూలం తీసుకుని.. వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకండగా ఉందని, పర్యవేక్షణలో ఉంచామని వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..