కామెడీ సీన్‌గా మారిన పాక్ ప్రధాని టూర్.. మరోసారి ప్రపంచం ముందు పాకిస్థాన్ నవ్వులపాలు!
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి అయిపోతుందా..? నక్క ఎన్ని జిత్తులమారి వేషాలేసినా.. పులి పంజాను తట్టుకోగలుగుతుందా..? ప్రపంచం తలకిందులైనా జరగనీ పనులివి. ఇప్పుడు పాకిస్థాన్ ఇదే పనిచేస్తోంది. దుర్భేద్యమైన ఆయుధ సంపత్తి ఉన్న భారత్‌ను చూసి.. సైన్యానికి కనీసం బూట్లు కొనివ్వలేని పాక్ వాతలు పెట్టుకోవడం హాస్యాస్పదంగా మారింది.

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి అయిపోతుందా..? నక్క ఎన్ని జిత్తులమారి వేషాలేసినా.. పులి పంజాను తట్టుకోగలుగుతుందా..? ప్రపంచం తలకిందులైనా జరగనీ పనులివి. ఇప్పుడు పాకిస్థాన్ ఇదే పనిచేస్తోంది. దుర్భేద్యమైన ఆయుధ సంపత్తి ఉన్న భారత్‌ను చూసి.. సైన్యానికి కనీసం బూట్లు కొనివ్వలేని పాక్ వాతలు పెట్టుకోవడం హాస్యాస్పదంగా మారింది. భారత్ ప్రధానిని.. పాక్ ప్రధాని కాపీ కొట్టిన విధానం కామెడీగా తాయారైంది. పాక్ పైరసీ వ్యవహారం మరోమారు ప్రపంచదేశాలకు తెలిసిపోయింది..!
ప్రపంచదేశాలు సైతం భారత్‌ను టచ్ చేయాలంటే వణికిపోయేలా మోదీ చూట్టూ అలంకరణలా మిగ్-29 యుద్ధవిమానాలతో పాటు శత్రువుల మిసైళ్లను క్షణాల్లోనే గాల్లో ధ్వంసం చేసే S-400. ఇక మోదీ ఆరేంజ్ సీన్లు, స్పీచ్‌లు చూసి నిద్రపట్టని పాకిస్తాన్ ప్రధానమంత్రి.. పైరసీ కాపీలా మారిపోయారు. మోదీ సైనికులను కలిసి ఉత్సాహాన్ని నింపినట్లే.. ఈయన కూడా పాక్ సైన్యాన్ని కలిశారు. అదంపూర్‌లో మోదీ ఏం చేశారో.. షహబాజ్ షరీఫ్ అదే రిపీట్ చేయబోయి కాపీ మాస్టర్‌లా తయారయ్యారు.
ఎయిర్‌బేస్‌లో మోదీ ల్యాండైతే… షరీఫ్ మాత్రం చూట్టూ ఎడారిలా ఉన్న ప్రాంతంలో హడావుడి చేశారు. ఓవైపు మిగ్-29, మరోవైపు S-400తో మోదీ కనిపిస్తే.. పాక్ ప్రధాని మాత్రం కూలిపోయిన శకలాలు, పిల్లల ఎగ్జిబిషన్‌కి పెట్టిన డమ్మీ ఆయుధాల్లాంటి వాటితో ఓవరాక్షన్ చేశారు. మోదీ సైనికుల్లో ఒకడిలా కలిపోయిన షేక్ హ్యాండిస్తే, షరీష్ సైతం ఈ సీన్‌ని కూడా కాపీ కొట్టి కామెడీ పండించారు. సెల్యూట్ సైనికా… మీ సేవలను దేశం ఎన్నటికీ మరవదికా.. అంటూ మోదీ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. వందేమాతరం, వందేమాతరం అంటూ సైనికుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇక్కడ షరీఫ్ సైతం ఏదో మాట్లాడుతూ… పాక్ సైన్యంతో నినాదాలు చేయించడం హాస్యాస్పదంగా మారింది.
మొత్తంగా.. పైన చెప్పుకున్నట్లు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా తయారైంది పాక్ ప్రధాని పరిస్థితి. భారత్ జోలికొస్తే ఊచకోతే.. ఇక బోర్డర్‌లో ఉన్న సామాన్యుడిని సైతం టచ్ చేయలేరంటూ ప్రపంచదేశాలకు తెలిసేలా మోదీ వ్యహరిస్తే.. సిల్లీగా ఆయనను కాపీ కొట్టి అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు పాక్ ప్రధాని. మోదీ టూర్‌లో దేశభక్తి ఉట్టిపడితే.. షరీఫ్ పర్యటనలో మాత్రం ఏం లేకపోయినా హడావుడి చేసినట్లుగా కనిపించింది. టచ్ చేసి చూడు అనేలా మోదీ బ్యాక్‌గ్రౌండ్‌లో మిస్సైల్స్ ఉంటే.. పాక్ ప్రధాని ఆకులు చుట్టిన ఫిరంగి ముందు హల్‌చల్ చేయడం కామెడీగా తయారైంది. ఓవరాల్‌గా ప్రపంచదేశాల ముందు పాక్ మరోసారి నవ్వులపాలైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
