Robbery: ఈ చోరుల స్టైలే వేరు.. మొబైల్ అమ్మడానికి బాక్స్ ఓపెన్ చేసిన యజమాని.. కట్ చేస్తే 100 ఫోన్స్ మిస్..

|

Sep 12, 2023 | 7:34 AM

బీహార్‌లోని వైశాలి జిల్లా హాజీపూర్‌లో దొంగలు సంచలన రీతిలో చోరీకి పాల్పడ్డారు. హాజీపూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సినిమా రోడ్‌లో గల శివ్ మొబైల్ జోన్‌లో దుకాణాన్ని దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. దుకాణం షట్టర్ కట్ చేసి లక్షల విలువైన మొబైల్ ఫోన్లను దొంగిలించి పరారయ్యారు. ఉదయం శివ్‌ మొబైల్‌ జోన్‌ యజమాని ధరమ్‌వీర్‌ కుమార్‌ దుకాణం తెరిచేందుకు రావడంతో ఈ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది.

Mobile Robbery: బీహార్‌లోని వైశాలి జిల్లా హాజీపూర్‌లో దొంగలు సంచలన రీతిలో చోరీకి పాల్పడ్డారు. హాజీపూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సినిమా రోడ్‌లో గల శివ్ మొబైల్ జోన్‌లో దుకాణాన్ని దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. దుకాణం షట్టర్ కట్ చేసి లక్షల విలువైన మొబైల్ ఫోన్లను దొంగిలించి పరారయ్యారు. ఉదయం శివ్‌ మొబైల్‌ జోన్‌ యజమాని ధరమ్‌వీర్‌ కుమార్‌ దుకాణం తెరిచేందుకు రావడంతో ఈ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది.

షాప్ ఓపెన్ చేసి చూసిన యజమాని.. షాక్ అయ్యాడు. షాపు షట్టర్ డౌన్ అయి ఉండడం, మొబైల్ ఫోన్ ర్యాక్ ఖాళీగా ఉంటం, మొబైల్ ఫోన్ కేసులు చెల్లాచెదురుగా పడి ఉండడం గమనించిన యజమాని.. చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదుకు చేశాడు. చోరీ ఘటనపై సమాచారం అందుకున్న నగర పోలీస్‌స్టేషన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని షాపు యజమాని నుంచి సమాచారం తీసుకున్నారు.

100 మొబైల్స్ చోరీ..

శివ్ మొబైల్ జోన్ యజమాని ధరంవీర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి గుర్తుతెలియని దొంగలు మొబైల్ షాపు తాళం, షట్టర్ కట్ చేసి మొబైల్స్ అన్నీ ఎత్తుకెళ్లారు. దొంగలు దాదాపు 100 మొబైల్ ఫోన్లు తీసుకెళ్లారు. వాటి ధర దాదాపు రూ.20 లక్షలు ఉంటుందని చెబుతున్నారు షాపు యజమాని. షట్టర్లను కత్తిరించేందుకు దొంగలు ఉపయోగించిన కట్టర్‌ను సంఘటనా స్థలంలో వదిలేశారు. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మొబైల్స్ అన్నీ ఎత్తుకెళ్లిన దొంగలు.. ఆ మొబైల్ బాక్స్‌లను మాత్రం వదిలేస్తారు.

సీసీటీవీని పరిశీలిస్తున్న పోలీసులు..

మొబైల్ షాప్ బయట, లోపల అమర్చిన సీసీటీవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంతకు ముందు కూడా హాజీపూర్ నగరంలో ఇలాగే మొబైల్ షాపుల్లో దొంగతనాలు జరిగాయి. దొంగను వెంటనే అరెస్ట్ చేయాలని బాధిత మొబైల్ దుకాణదారుడు పోలీసులను వేడుకున్నాడు. ఈ చోరీపై దుకాణదారుడు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..