Watch: మెట్రోలో లివర్ తరలింపు.. నిమిషాల్లోనే ఆస్పత్రికి.. వీడియో చూశారా..?

బెంగళూరు మెట్రోలో మొదటిసారిగా కాలేయాన్ని విజయవంతంగా రవాణా చేశారు. వైద్య బృందం వైట్‌ఫీల్డ్ స్టేషన్ నుండి ఆర్ఆర్ నగర్ స్టేషన్‌కు మెట్రో ద్వారా కాలేయాన్ని తరలించారు. మెట్రో సిబ్బంది, భద్రతా అధికారులు ఎటువంటి ఆటంకాలు రాకుండా తగిన చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch: మెట్రోలో లివర్ తరలింపు.. నిమిషాల్లోనే ఆస్పత్రికి.. వీడియో చూశారా..?
Liver Transport

Updated on: Aug 02, 2025 | 6:08 PM

నగరాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మెట్రోతో ప్రయాణికుల కష్టాలు కొంచెం తగ్గాయని చెప్పొచ్చు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా నిమిషాల్లోనే డెస్టినేషన్ చేరుకోవచ్చు. దీంతో చాలా మంది మెట్రో కే ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా మెట్రో కేవలం ప్రయాణికులనే కాదు ఎమర్జెన్సీ సమయాల్లో అవయవాలను తరలిస్తూ మన్ననలు పొందుతుంది. గతంలో హైదరాబాద్ మెట్రోలో తక్కువ సమయంలోనే గుండె తరలించిన ఘటన అందరినీ ఆకర్షిచింది. 13కిలోమీటర్ల దూరాన్ని కేవలం 13నిమిషాల్లోనే చేరుకుని ఓ వ్యక్తి ప్రాణాలు నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే జరిగింది. అయితే ఇది బెంగుళూరులో జరిగింది.

బెంగళూరు మెట్రో అత్యవసర సమయంలో అద్భుత పనితీరును ప్రదర్శించింది. అధికారులు సమన్వయంతో మెట్రోలో కాలేయాన్ని అతితక్కువ సమయంలో తరలించారు. వైట్‌ఫీల్డ్ మెట్రో స్టేషన్ నుండి మైసూరు రోడ్‌లోని రాజరాజేశ్వరినగర్ మెట్రో స్టేషన్‌కు లివర్‌ను తరలించారు. శుక్రవారం రాత్రి 8.38 గంటలకు.. కాలేయాన్ని వైదేహి హాస్పిటల్ నుండి వైట్‌ఫీల్డ్ మెట్రో స్టేషన్‌కు అంబులెన్స్ ద్వారా తరలించారు. అక్కడి నుంచి మెట్రోలో రాజరాజేశ్వరి నగర్ మెట్రో స్టేషన్‌కు తరలించారు. రాత్రి 8.42 గంటలకు వైట్‌ఫీల్డ్ మెట్రో స్టేషన్ నుంచి ప్రారంభమై రాత్రి 9.48 గంటలకు రాజరాజేశ్వరి నగర్ మెట్రో స్టేషన్‌కు చేరుకుంది. అధికారులు, పోలీసులు ఎక్కడా ఆటంకాలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. ..