Section 66A of IT Act cases Withdraw: కేంద్ర హోం మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ -2000 సెక్షన్ 66ఎ కింద నమోదైన కేసులు ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈమేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు నమోదైన అన్ని కేసులను ఎత్తివేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, సెక్షన్ 66ఎ కింద కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని కేంద్ర హోం శాఖ ఆదేశించింది.
ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ 2015లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడి ఆరేళ్లు కావస్తున్నా ఆ సెక్షన్ కింద దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు కావడంపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది భారత అత్యున్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలో హోంశాఖ తాజా నిర్ణయం తీసుకుంది. కాగా, సుప్రీం తీర్పు వెలువరించిన తర్వాత దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 1,307 కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. ఇటు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ 50కి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతానికి ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ కింద దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 740కి పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ -2000 సెక్షన్ 66ఏ కింద దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ద్వారా తెలిసుకుని వాటిని ఎత్తివేయాలని పీయూసీఎల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2015వ సంవత్సరంలో శ్రేయ సింఘాల్ కేసులో ఐటీ యాక్ట్‌లోని 66ఏ సెక్షన్ రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ దాన్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు.
Ministry of Home Affairs (MHA) has requested States and UTs to direct all police stations under their jurisdiction not to register cases under the repealed Section 66A of the Information Technology Act, 2000: MHA#TV9News
pic.twitter.com/AdXhJbvqUO— tv9gujarati (@tv9gujarati) July 14, 2021