‘ఈద్ సంబరాలు తరువాత.. లాక్ డౌన్ పొడిగించండి’.. దీదీకి ముస్లిం మతగురువుల లేఖ

| Edited By: Anil kumar poka

May 10, 2020 | 5:27 PM

బెంగాల్ లో లాక్ డౌన్ ను ఈ నెల 30 వరకు పొడిగించాలని ఆ రాష్ట్రంలోని ఇమామ్ ల సంఘం కోరింది. ఈ మేరకు ఈ సంఘం చైర్మన్ మహమ్మద్ యాహ్యా... సీఎం మమతా బెనర్జీకి ఓ లేఖ రాస్తూ...

ఈద్ సంబరాలు తరువాత.. లాక్ డౌన్ పొడిగించండి.. దీదీకి ముస్లిం మతగురువుల  లేఖ
Follow us on

బెంగాల్ లో లాక్ డౌన్ ను ఈ నెల 30 వరకు పొడిగించాలని ఆ రాష్ట్రంలోని ఇమామ్ ల సంఘం కోరింది. ఈ మేరకు ఈ సంఘం చైర్మన్ మహమ్మద్ యాహ్యా… సీఎం మమతా బెనర్జీకి ఓ లేఖ రాస్తూ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, అందువల్ల లాక్ డౌన్ ని పొడిగించాలని కోరారు. ‘మొదట ప్రజలను బతకనివ్వండి.. ఆ తరువాతే ఈద్ సంబరాలు జరుపుకుంటాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 25 న ఈద్-ఉల్-ఫితర్ ని ముస్లిములు జరుపుకోనున్నారు. కానీ మమత ప్రభుత్వం ఈ నెల 21 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేస్తామని, 25 న ఈ పండుగ ఉన్నందున.. ఆంక్షలను సడలించే యోచన ఉందని ఇది వరకే ప్రకటించింది. అంటే.. ఆంక్షల సడలింపు వల్లముస్లిములు ఈద్ ని ఉత్సాహంగా జరుపుకోగలరని భావించింది. అయితే ఇందుకు  ఇమామ్ లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కరోనా మహమ్మారి కారణంగా మొదట లాక్ డౌన్ ని ఈ నెల 30 వరకు పొడిగించాలన్నారు. ఇప్పటికే తాము ఎన్నో త్యాగాలు చేశామని, మళ్ళీ ఇందుకు సిధ్దపడతామని మహమ్మద్ యాహ్యా తన లేఖలో పేర్కొన్నారు. ఈద్ సంబరాల కన్నా మనుషుల ప్రాణాలు మిన్న అన్న టైపులో మాట్లాడిన ఆయన.. తమ లేఖ తాలూకు కాపీలను బెంగాల్ లోని ముస్లిం సంఘాలకనింటికీ  పంపారు. మరి దీనిపై మమత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.