అలోపతి మందులపైన, డాక్టర్లపైన యోగాగురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ..ఆయనకు వెయ్యి కోట్ల రూపాయల పరువు నష్టం నోటీసును పంపింది. పైగా 15 రోజుల్లోగా లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.ఉత్తరాఖండ్ ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ అజయ్ ఖన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కు, చీఫ్ సెక్రటరీకి కూడా లేఖలు రాస్తూ బాబా కామెంట్స్ పై తమ సంస్థలోని డాక్టర్లంతా తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ రాందేవ్ బాబా 15 రోజుల్లోగా వీడియోను రిలీజ్ చేయాలని, లిఖితపూర్వక అపాలజీ తెలియజేయాలని కోరినట్టు ఆయన వెల్లడించారు. ఇందులో ఏది చేయకపోయినా వెయ్యి కోట్ల పరువునష్టం దావాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. కాగా ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు కూడా బాబా రాందేవ్ స్టేట్ మెంట్ పట్ల నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని ప్రొటెస్ట్ చేశారు.
బాబా వ్యాఖ్యలపట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్ లేఖ రాసిన అనంతరం వాటిని ఆయన ఉపసంహరించుకున్నారు. అయితే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి 25 ప్రశ్నలను సంధించారు. బీపీ, డయాబెటిస్ వంటివాటికి ఆలోపతీలో శాశ్వత చికిత్స ఉందా అని, అలాగే ఆస్త్మా, కీళ్లనొప్పులు వంటి రుగ్మతలకు ఫార్మా ఇండస్ట్రీ వద్ద శాశ్వత చికిత్సా విధానం ఉందా అంటూ ఇలాగే ఎన్నో ప్రశ్నలు వేశారు. అల్లోపతి సర్వ రోగ నివారణమైతే డాక్టర్లు సైతం ఎందుకు అస్వస్థులవుతున్నారని అన్నారు. కాగా మొదట బాబా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Lunar Eclipse 2021: సంపూర్ణ చంద్రగ్రహణం..గ్రహణ సమయంలో ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు.. పండితులు ఏం చెబుతున్నారు?
Viral Video: తన ఓనర్ కార్ పార్కింగ్ చేసిన కుక్క..చూస్తే పక్కా షాక్ అవుతారు..! ( వీడియో )