IIT-IIIT: ఇంజనీరింగ్ చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. ఐఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో సీట్ల పెంపు

|

Jun 20, 2023 | 11:36 AM

దేశంలో ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులకు శుభవార్త అందింది. ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యా సంస్థలైన ఐఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు పెరిగాయి. గత ఏడాదిలో దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 16,598 సీట్లు ఉన్నాయి. అయితే ఈ విద్యా సంవత్సరం ఆ సంఖ్య ఏడాది సూపర్‌ న్యూమరరీతో కలిపి 17,385కు పెరిగింది.

IIT-IIIT: ఇంజనీరింగ్ చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. ఐఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో సీట్ల పెంపు
Students
Follow us on

దేశంలో ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులకు శుభవార్త అందింది. ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యా సంస్థలైన ఐఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు పెరిగాయి. గత ఏడాదిలో దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 16,598 సీట్లు ఉన్నాయి. అయితే ఈ విద్యా సంవత్సరం ఆ సంఖ్య ఏడాది సూపర్‌ న్యూమరరీతో కలిపి 17,385కు పెరిగింది. అంటే మొత్తం 787 సీట్లు పెరిగాయి. అలాగే 26 ట్రిపుల్‌ఐటీల్లో 620 సీట్లు పెరిగాయి. దీంతో వీటి సీట్ల సంఖ్య 7,746కు చేరింది. దేశంలో 32 ఎన్‌ఐటీలు ఉండగా ఇందులో 40 సీట్లు తగ్గాయి.ఈ విద్యా సంవత్సరం ఎన్‌ఐటీల్లో 23,954 సీట్లు భర్తీ చేయనున్నారు. అయితే ఎన్ఐటీల్లో అమ్మాయిలదే హవా నడుస్తోంది. వీటిలో అబ్బాయిల కంటే అమ్మాలే ఎక్కుగా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వారికి ప్రత్యేకంగా సూపర్ న్యూమరరీలో సీట్లు కేటాయిస్తున్నారు. అయితే ఈసారి ఆ సీట్లకు కోత పెట్టడంతోనే 40 సీట్లు తగ్గినట్లు తెలుస్తోంది.

అలాగే ప్రభుత్వ ఫండ్స్‌తో నడిచే జీఎఫ్‌టీఐ 38 ఉండగా.. వాటిలో 8,067 సీట్లు ఉన్నాయి. ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఎన్‌ఐటీలు, జీఎఫ్‌టీఐ.. ఈ నాలుగు రకాల సాంకేతిక విద్యాసంస్థలు మొత్తం 119 ఉన్నాయి. గత ఏడాది వీటిలో 54,477 సీట్లు ఉండేవి. ఈ విద్యా సంవత్సరం 2,765 సీట్లు అదనంగా పెరగడంతో మొత్తం సీట్లు సంఖ్య 57,152 కు చేరింది. ఇక ఐఐటీ హైదరాబాద్‌లో గత ఏడాది 505 సీట్లు ఉండగా వాటి సంఖ్య ఈసారి 595కు చేరింది. ఐఐటీ తిరుపతిలో గత ఏడాది 237 సీట్లు ఉండగా ఈసారి 3 సీట్లు పెరిగి మొత్తం 240 కి చేరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి