
గౌహతి IIT కాలేజీకి సంబంధించిన ఒక వీడియో ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకర్షించింది. దీపావళి సందర్భంగా రాకెట్ , పటాఖా యుద్ధం నడించింది. బరాక్, ఉమియం హాస్టల్ విద్యార్థుల మధ్య టపాసుల వార్ జరిగింది. పండుగ రోజు సాయంత్రం క్యాంపస్‌లో బాణసంచా పోరాటంగా మార్చారు.
ఇప్పుడు వైరల్‌గా మారిన వీడియోలో, విద్యార్థులు హాస్టల్ భవనాల నుండి ఒకరిపై ఒకరు రాకెట్లు పేల్చుకుంటూ, పటాఖాలు పేల్చుకుంటూ, క్యాంపస్ ఆకాశాన్ని కప్పి, ప్రమాదకరమైన బాణసంచా యుద్ధంగా మార్చేశారు. సరదాగా ప్రారంభమైన దీపావళి వేడుక, కోలాహలంగా మారింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. బాణసంచా కాల్చడం, హాస్టళ్ల సామీప్యత కారణంగా ఆ చర్య వేడుకలా కాకుండా బాణసంచా యుద్ధభూమిలా ఉంది.
ఇందుకు సంబంధించిన వీడియోను @WokePandemic ఖాతా ద్వారా షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షలాది మంది వీక్షించారు. అంతేకాదు రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు నెటజన్లు. “రాకెట్లు-క్షిపణులు ఎలా పనిచేస్తాయో విద్యార్థులు పరీక్షిస్తున్నారని” ఒకరు వ్యాఖ్యానించారు. వాస్తవ ప్రపంచంలో భౌతిక శాస్త్రం, జ్యామితిని అభ్యసిస్తున్నారని మరొకరు పేర్కొన్నారు. చాలా మంది దీనిని ఎగతాళి చేసినప్పటికీ, కొందరు ఈ దారుణమైన చర్యను ఖండించారు. నియంత్రణ లేని పటాకుల యుద్ధం వల్ల కలిగే తీవ్రమైన ప్రమాదంగా పేర్కొన్నారు.
వీడియో చూడండి..
This video is allegedly said to be from IIT Guwahati where there was Diwali fire crackers war among "most talented" students of India.
Police had to intervene to stop the Fire crackers War
Seems these students were trying to learn how rockets and missiles work, and how physics… pic.twitter.com/nwOjucwr8m
— Woke Eminent (@WokePandemic) October 22, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..