
ప్రతీనెల చివరి ఆదివారం ప్రసారమయ్యే ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం దేశ ప్రజలకు ఎంతలా చేరువైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ ప్రజలతో మమేకం కావాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని ప్రజలతో పలు విషయాలపై ముచ్చటిస్తారు. దేశంలోని మారు మూల ప్రాంతాల్లో జరిగే అంశాలపై కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావిస్తుంటారు. అందుకే ఈ కార్యక్రమం ప్రజలకు చాలా చేరువైంది. ఇదిలా ఉంటే మన్ కీ బాత్ కార్యక్రమం తాజాగా 100వ ఎపిసోడ్‌కు చేరుకోనుంది. ఏప్రిల్ 30వ తేదీన జరిగే ఎపిసోడ్‌తో 100వ ఎపిసోడ్ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఐఐఎమ్‌సీ మీడియా రంగానికి చెందిన వ్యక్తులపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో వెల్లడైన పలు ఆసక్తికర విషయాలు మీకోసం..
సర్వేలో పాల్గొన్న సుమారు 76 శాతం మంది మీడియా వ్యక్తులు.. ‘మన్ కీ బాత్ కార్యక్రమం ఇండియన్స్‌కి సరికొత్త భారతదేశాన్ని పరిచయం చేసిందని’ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు దేశంలో ఇతర ప్రాంతాల్లో జరుగుతోన్న ఎన్నో విషయాలపై అవగాహన పెంచుకుంటున్నారని సర్వేలో తేలింది. మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజల జీవన విధానం, పని సంస్కృతి వంటి అంశాలను ప్రజలకు తెలియజేసే ఒక వారధిలా మన్ కీ బాత్ నిలిచినట్లు 75 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ సర్వేను ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు నిర్వహించినట్లు ఐఐఎమ్‌సీ డైరెక్టర్ సంజయ్ ద్వివేది తెలిపారు. ఈ సర్వేలో మీడియ రంగానికి చెందిన సుమారు 890 మంది పాల్గొన్నారు. వీరిలో 326 మంది మహిళలు కాగా 564 మంది పురుషులు ఉన్నారు. అలాగే వీరిలో 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న వారు 66 శాతం కావడం విశేషం.
సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయం ప్రకారం.. దేశానికి సంబంధించి విజ్ఞానం, దేశాభివృద్ధిపై ప్రధానికి మోదీకి ఉన్న విజన్‌లే మన్ కీ బాత్ ఎక్కువ మంది శ్రోతలు వినడానికి కారణాలుగా చెబుతున్నారు. ఒకవేళ లైవ్ కార్యక్రమాన్ని చూడడం మిస్ అయితే యూట్యూబ్ ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వింటామని 63 శాతం మంది తెలిపారు. ఎలాంటి సమస్యల పరిష్కారానికి మన్ కీ బాత్ కార్యక్రమం ఉపయోగపడిందన్న ప్రశ్నకు 40 శాతం మంది విద్య, గ్రామీణ భారతానికి సంబంధించిన వివరాలకు సంబంధించదని 26 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఇక మన్ కీ బాత్‌లో ప్రధాని మాట్లాడిన అంశాలను ఎవరితో పంచుకుంటారన్న ప్రశ్నకు 32 శాతం మంది తమ కుటుంబ సభ్యులతో అని బదులివ్వగా, 29 శాతం మంది తమ స్నేహితులు, సహోద్యుగులతో పంచుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎలా వింటున్నారన్న ప్రశ్నకు 12 శాతం మంది రేడియో, 15 శాతం మంది టెలివిజన్, 37 శాతం మంది ఇంటర్‌నెట్ ఆధారిత సేవల ద్వారా అని బదులిచ్చారు.
ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని పలు సందర్భాల్లో పంచుకున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాలు, పలువురు సాధించిన విజయాలను పంచుకున్నారు. భారతదేశానికి ఏపీ, తెలంగాణ సహకారాలను మోదీ ప్రస్తావించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో ఉన్న పలు ప్రత్యేకతలను, కొందరు వ్యక్తులు సాధించిన ఘనతలను ప్రధాని దేశ ప్రజలందరితో పంచుకున్నారు. సమాజ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ఎందరో స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల జీవిత కథలను పేర్కొన్నారు ప్రధాని.
సిరిసిల్ల పట్టణానికి చెందిన వెల్ది హరిప్రసాద్ కు అరుదైన గౌరవం దక్కింది. చేనేత మగ్గంపై పలు ఆవిష్కరణలు చేయడంతో పాటు జి20 లోగోని నేసినందుకు ప్రధాని మోదీ నుంచి అభినందనలు పొందారు హరిప్రసాద్. ఇప్పుడు తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళి సై నుంచి రాజభవన్ రావాలని మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ప్రత్యేక స్క్రీనింగ్ నుండి వీక్షించాలని కబురందింది. ఈమేరకు రాజ్ భవన్ నుండి లెటర్ పంపారు. దీంతో తన ప్రతిభ గుర్తించిన ప్రధానమంత్రి మోడీ, గవర్నర్ తమిళ్ సై, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు హరి ప్రసాద్.
గతంలో చేనేత మగ్గం పై అనేక ప్రయోగాలు చేశాడు హరిప్రాసాద్. బుల్లి మరమగ్గాలు, అగ్గిపెట్టలో ఇమిడే వెండి చీర, దబ్బనం సూదిలో దూరే చీరలు, కెసిఆర్, కేటీఆర్, ముఖచిత్రాలు, ఆజాద్ కి అమృతం మహోత్సవం సందర్భంగా జాతీయ గీతం, భారతదేశ ముఖచిత్రం ఒకే వస్త్రం పై వచ్చే విధంగా నేశారు. అలాగే మహాత్మా గాంధీజీ 150వ పుట్టినరోజుకు గాంధీజీ నూలు వాడుతున్న విధానం, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోటో తో నేసిన వస్త్రం, రాజన్న సిరిపట్టు నామ కరణం చేశారు.
Began today’s #MannKiBaat programme by talking about a very special gift I received from a weaver in Telangana and how it is an example of keen interest towards India’s G20 Presidency. pic.twitter.com/NSKgGroS9s
— Narendra Modi (@narendramodi) November 27, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..