Covid-19 vaccine: మారుమూల ప్రాంతాలకు కోవిడ్‌ వ్యా్క్సిన్‌.. డ్రోన్‌ ద్వారా నిమిషాల్లోనే సరఫరా.. వీడియో..

|

Oct 05, 2021 | 12:05 PM

Covid-19 vaccines Drone: కరోనావైరస్‌ కట్టడికి దేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ సంఖ్య 90 కోట్లు దాటింది. ఈ క్రమంలో మారుమూల

Covid-19 vaccine: మారుమూల ప్రాంతాలకు కోవిడ్‌ వ్యా్క్సిన్‌.. డ్రోన్‌ ద్వారా నిమిషాల్లోనే సరఫరా.. వీడియో..
Covid 19 Vaccine
Follow us on

Covid-19 vaccines Drone: కరోనావైరస్‌ కట్టడికి దేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ సంఖ్య 90 కోట్లు దాటింది. ఈ క్రమంలో మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లను పంపించాలంటే అత్యంత కష్టంగా మారింది. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో నివసించే ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేయాలంటే వైద్య సిబ్బంది ఎంతో ప్రయాసతో చేరుకోవాల్సి వస్తోంది. తగినంత టెంపరేచర్‌లో వ్యాక్సిన్ నిల్వ చేయడం.. మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేయడం కష్టంగా మారిన తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా తరలించే ప్రక్రియను ప్రారంభించింది. దీనిలో భాగంగా రహదారులు సరిగా లేని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ సరఫరా చేసే కార్యక్రమానికి కేంద్రం సోమవారం శ్రీకారం చుట్టింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ డ్రోన్లతో టీకాల సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి ట్విట్‌ చేశారు. వేగవంతమైన వ్యాక్సినేషన్‌లో భాగంగా 900డోసుల టీకాను డ్రోన్‌ ద్వారా తరలించినట్లు వెల్లడించారు.

వీడియో..

Also Read:

Lakhimpur Kheri Viral Video: అన్నదాతలపైకి దూసుకెళ్లిన కారు.. వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్ నాయకులు..

Dussehra Holidays: దసరా పండుగ సెలవులను ప్రకటించిన తెలంగాణ సర్కార్.. ఎప్పటి నుంచంటే..