Plasma Therapy: ఐసీఎంఆర్ కీలక నిర్ణయం.. కోవిడ్ చికిత్స నుంచి ప్లాస్మా థెరపి తొలగింపు

|

May 17, 2021 | 10:47 PM

Coronavirus:ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ సోకిన బాధితులకు అత్యవసర వైద్య చికిత్సలో ఉపయోగించే ప్లాస్మా

Plasma Therapy: ఐసీఎంఆర్ కీలక నిర్ణయం.. కోవిడ్ చికిత్స నుంచి ప్లాస్మా థెరపి తొలగింపు
Plasma Therapy
Follow us on

Coronavirus:ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ సోకిన బాధితులకు అత్యవసర వైద్య చికిత్సలో ఉపయోగించే ప్లాస్మా థెరపీని కోవిడ్ ప్రోటోకాల్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం రాత్రి కోవిడ్ టాస్క్ ఫోర్స్, వైద్య ఆరోగ్యశాఖ, ఎయిమ్స్, ఐసీఎంఆర్ సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు కరోనా రోగుల క్లినికల్ గైడ్‌లైన్స్‌ను సవరిస్తూ ఐసీఎంఆర్ నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్స నుంచి ప్లాస్మా థెరపీని తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశాయి.

తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్లాస్మా చికిత్స నిలిచిపోనుంది. ఈ చికిత్సను ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా నిర్వహించారు. కరోనా రోగులకు అత్యవసర సమయాల్లో దీని ద్వారా వైద్యం అందించారు. అయితే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన అనంతరం.. కొన్ని రోజులకు ప్లాస్మాను దానం చేస్తారు. అయితే కరోనా బాధితులంతా తమ ప్లాస్మాను దానం చేసి అత్యవసర సమయాల్లో కాపాడాలంటూ పలువురు స్టార్ నటులు సైతం అవగాహన కల్పించిన విషయం తెలిసిందే.