మానవతకు చిరునామాగా నిలిచారు ఆ జవాన్లు !

| Edited By: Anil kumar poka

Sep 02, 2020 | 12:02 PM

మరణించిన వ్యక్తి ఎవరో తమకు తెలియదు. అతనితో తమకు ఎలాంటి సంబంధాలూ లేవు. కనీసం పరిచయం కూడా లేదు. కానీ అతని మృతదేహాన్ని స్ట్రెచర్ పై వేసుకుని భుజాన మోసుకుంటూ...

మానవతకు చిరునామాగా నిలిచారు ఆ జవాన్లు !
Follow us on

మరణించిన వ్యక్తి ఎవరో తమకు తెలియదు. అతనితో తమకు ఎలాంటి సంబంధాలూ లేవు. కనీసం పరిచయం కూడా లేదు. కానీ అతని మృతదేహాన్ని స్ట్రెచర్ పై వేసుకుని భుజాన మోసుకుంటూ ఎనిమిది మంది జవాన్లు 25 కి.మీ. దూరం, 8 గంటలపైగా నడిచారు. ఉత్తరాఖండ్ పితోరాఘడ్ జిల్లాలోని సియునీ అనే మారుమూల గ్రామం నుంచి మున్సారీ అనే మరో పల్లె చేరేందుకు వారీ ‘సాహసం’ చేశారు. ఈ గ్రామంలో ఈ అపరిచిత వ్యక్తి మృత దేహాన్ని అతని బంధువులకు అప్పగించేందుకు రాళ్లు, గుట్టలతో నిండిన దుర్గమ మార్గం ద్వారా ప్రయాణించారు. 30 ఏళ్ళ ఈ వ్యక్తి రాళ్లు కొడుతూ హఠాత్తుగా చనిపోయాడని తెలిసిన ఇండో-టిబెటన్ బోర్డర్ జవాన్లు ఇలా తమ మానవతను చాటుకున్నారు.