IAS Pooja Singhal Raid: జార్ఖండ్‌లో అక్రమ మైనింగ్ కేసులో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఏక కాలంలో 18 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి కోట్లాది రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో భాగంగా జార్ఖండ్ కేడర్ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ ఇంట్లో రెండో రోజు కూడా అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. మన్రేగా (ఉపాధి హామీ) నిధులను మైనింగ్ పేరుతో దుర్వినియోగం చేసినట్లు ఐఏఎస్ సహా పలువురు వ్యక్తులపై ఆరోపణలు ఉన్నాయి. ఐఏఎస్ పూజా సింఘాల్ సీఏ సుమన్ సింగ్ ఇంటి నుంచి 19 కోట్ల నగదు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం రూ.25 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు సింఘాల్ భర్త అభిషేక్ ఇంట్లో, ఆయన నిర్వహిస్తున్న ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో ఇంకా దాడులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే, అభిషేక్ కె ఝా, సిఎ సుమన్ సింగ్‌ను ఇడి అదుపులోకి తీసుకొని వాంగ్మూలాన్ని సేకరించారు.
కాగా.. అక్రమ మైనింగ్ వ్యవహారంలో రాంచీ, చండీఘడ్, ముంబై, కోల్‌కతా, ముజాఫర్‌పుర్, ఎన్సీఆర్, నోయిడా, ఫరీదాబాద్, గురుగ్రామ్‌లో సోదాలు జరిగాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఆ రాష్ట్ర మైనింగ్ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. కాగా.. ఐఏఎస్ పూజా సింఘాల్ మైన్స్ జియాలజీ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. అయితే.. ఆమె గర్వాలో జరిగిన అక్రమ మైనింగ్ కేసులో నిందితురాలిగా ఉన్నారు. అయితే.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు పూజా సింఘాల్ సన్నిహిత అధికారిణిగా పలువురు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఈడీ దాడులు సంచలనంగా మారాయి.
ED raids locations linked to Jharkhand mining secretary IAS #PoojaSinghal. Imagine this amount of tax player's money could have changed lives of thousands of poor people. Jai ho Jharkhand. pic.twitter.com/FlT0oREFcX
— Shesh Paul Vaid (@spvaid) May 7, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: