UP Block Panchayat Elections: ఉత్తరప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవల ఎస్పీ పార్టీకి చెందిన మహిళను నామినేషన్ వేయకుండా.. బీజేపీకి చెందిన నాయకులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె చీర లాగి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదిలాఉంటే.. కొంత మంది అధికారులు సైతం విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ ఐఏఎస్ అధికారి కూడా విచక్షణ కోల్పోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఐఏఎస్ అధికారి ఓ టీవీ రిపోర్టర్‌ను వెంటపడి మరి చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మియాగంజ్‌లో చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (సీడీవో) గా విధులు నిర్వహిస్తున్న దివ్యాన్షు పటేల్ జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్టు సెల్‌ఫోన్‌తో అక్కడ నెలకొన్న పరిస్థితులను షూట్ చేస్తుండగా.. దివ్యాన్షు పటేల్ రెచ్చిపోయారు. వెంటపడి మరి జర్నలిస్టుపై దాడి చేశారు. కాగా.. బాధిత జర్నలిస్టు.. దివ్యాన్షు పటేల్ పై పలు ఆరోపణలు చేశాడు. ఓటింగ్‌లో పాల్గొనకుండా లోకల్ కౌన్సిల్ సభ్యులను కొందరిని కిడ్నాప్ చేశారని.. దీనిని ప్రశ్నించడంతో.. ఆయన దాడి చేశారని ఆరోపించారు. కాగా.. దీనిపై ఐఏఎస్ అధికారి దివ్యాన్షు స్పందిచంలేదు.
వీడియో..
ये कोई गुंडा नहीं।उन्नाव के IAS सीडीओ हैं,जो एक टी वी पत्रकार को दौड़ा-दौड़ा कर पीट रहे हैं।उसका क़ुसूर सिर्फ यह था कि सीडीओ की आंख के सामने हो रही बीडीसी मेंबर्स की धर-पकड़ उसने शूट कर ली थी। pic.twitter.com/mb6suKa98w
— Kamal khan (@kamalkhan_NDTV) July 10, 2021
ఇదిలాఉంటే.. ఈ ఘటనపై ఉన్నవో జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ స్పందించారు. అక్కడున్న జర్నలిస్టులతో.. ఈ ఘటనపై మాట్లాడామన్నారు. దాడికి గురైన జర్నలిస్ట్ నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు వచ్చిందని.. విచారణ అనంతరం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.
Also Read: