sasikala in t’nadu, తమిళనాట మళ్ళీ చిన్నమ్మ, త్వరలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన.

తమిళనాడు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు, అన్నా డీఎంకే బహిష్కృత నేత శశికళ రాష్ట్రంలో మళ్ళీ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.

sasikala in tnadu, తమిళనాట మళ్ళీ  చిన్నమ్మ, త్వరలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన.

Edited By:

Updated on: Feb 08, 2021 | 7:18 PM

తమిళనాడు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు, అన్నా డీఎంకే బహిష్కృత నేత శశికళ రాష్ట్రంలో మళ్ళీ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. సోమవారం ఈ రాష్ట్రంలో అడుగుపెట్టిన శశికళకు ఆమె మద్దతుదారులు ఘనంగా స్వాగతం  పలికారు.  త్వరలో తాను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని ఆమె ప్రకటించారు.  ఆదాయానికి మించి ఆస్తులకేసులో నాలుగేళ్ల పాటు ఆమె బెంగుళూరు లోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవించారు. ఇటీవలే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా శశికళపై అన్నా డీఎంకే అప్పుడే రెండు కేసులు పెట్టింది. తమ పార్టీ పతాకాన్ని ఆమె వినియోగించుకున్నారని, రాష్ట్రంలో హింసను రెచ్ఛగొట్టేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది. అయితే తను ఈ బెదిరింపులకు భయపడబోమని శశికళ అంటున్నారు. గత నెల 27 న జైలు నుంచి విడుదలైనప్పటి నుంచే ఈమె తన కారుపై అన్నా డీఎంకే పార్టీ పతాకాన్ని వినియోగించుకుంటున్నారు.

తమిళనాడులో  త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ నేపథ్యంలో రాజకీయాల్లో  చిన్నమ్మ జోరు ఎలా ఉంటుందో చూడాల్సిందేనని అంటున్నారు.

Read More:ఆ ఆటగాన్ని తక్కువ అంచనా వేస్తున్నారన్న మాజీ టీమిండియా ఆటగాడు.. ఎంతో విలువైన ఆటగాడని కితాబు…

Read More:విచిత్రం !ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూతుర్నే మోసగించాడు, ఎవరతను?