Nitin Gadkari: వంటలు చేస్తూ.. నెలకు రూ. 4 లక్షలు సంపాదిస్తున్న కేంద్రమంత్రి.. ఎలాగంటే..?

|

Sep 17, 2021 | 9:48 PM

Nitin Gadkari: ప్రజా సంపాదనతో పాటు ప్రచార సాధనాల్లోనూ సంపాదించవచ్చని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా 4లక్షల రూపాయలు వెనకేసుకున్నట్లు ప్రకటించారు.

Nitin Gadkari: వంటలు చేస్తూ.. నెలకు రూ. 4 లక్షలు సంపాదిస్తున్న కేంద్రమంత్రి.. ఎలాగంటే..?
Nitin Gadkari
Follow us on

Union Minster Nitin Gadkari: ప్రజా సంపాదనతో పాటు ప్రచార సాధనాల్లోనూ సంపాదించవచ్చని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా 4లక్షల రూపాయలు వెనకేసుకున్నట్లు ప్రకటించారు. కరోనా సమయంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు వెల్లడించారు. తన యూట్యూబ్ ఛానల్ చూసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. అంతేకాదు తన వీడియోలకు గానూ యూట్యూబ్ తనకు నెలకు రూ. 4 లక్షలు రాయల్టీ చెల్లిస్తోందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. తాను చెఫ్‌గా మారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనేక లెక్చర్లు ఇచ్చానని ఆయన తెలిపారు.

కరోనా సమయంలోనూ, ఖాళీ సమయాల్లో ఆన్‌లైన్‌లో దాదాపు 950 లెక్చర్లు ఇచ్చానని గడ్కరీ తెలిపారు. తన వీడియోలు చూసిన వారిలో విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారని కేంద్రమంత్రి అన్నారు. ఆ ప్రసంగాలకు సంబంధించిన వీడియోలన్నింటిని యూట్యూబ్‌ ద్వారా అప్‌లోడ్ చేశానని తెలిపారు. ఈ కారణంగా తన ఛానల్‌ను చూసే వారి సంఖ్య బాగా పెరిగిందని నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రస్తుతం యూట్యూబ్ తనకు నెలకు రూ. 4 లక్షలు రాయల్టీ చెల్లిస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఛానల్‌కు రెండు లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉండటం విశేషం.తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెల్లడించే గడ్కరీ.. మన దేశంలో మంచి పని చేసే వారికి ప్రొత్సాహం లభించదని అన్నారు. కరోనా సమయంలో తాను రెండు పనులు చేసినట్టు నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు.

ఇదిలావుంటే, ఢిల్లీ, ముంబై ఎక్స్‌ప్రెస్ రహదారిపై సమీక్ష నిర్వహించిన కేంద్రమంత్రి.. రోడ్ల నిర్మాణం కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లకు రేటింగ్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. గుజరాత్‌లో రూ. 35,100 కోట్లతో 423 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ఆర్థిక అభివృద్ధికి నాణ్యమైన రహదారులు ఉపయోగపడతాయని.. వాటి వల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. ఢిల్లీ, ముంబై ఎక్స్‌ప్రెస్ రహదారి ప్రాజెక్టులో భాగంగా గుజరాత్‌లో 60 మేజర్ బ్రిడ్జిలు, 17 ఇంటర్ ఛేంజ్‌లు, 17 ఫ్లై ఓవర్లు, 8 రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుందని అన్నారు. వీటితో పాటు ఎక్స్‌ప్రెస్ రహదారిపై 33 వే సైడ్ అమెనిటీస్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

Read Also…  GST Council: జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు.. ప్రస్తుతం సరియైన సమయం కాదుః ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్