CJI NV Ramana: 40 సంవత్సారాల అనుభవంతో చెప్తున్నా.. ఆర్బిట్రేషన్ చివరి దశలో జరగాలిః సీజేఐ ఎన్వీ రమణ

|

Dec 04, 2021 | 1:49 PM

ప్రతిరోజూ సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు లేకుండా మనిషి ఉండడు.. కోర్టులకు వచ్చేముందే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు.

CJI NV Ramana: 40 సంవత్సారాల అనుభవంతో చెప్తున్నా.. ఆర్బిట్రేషన్ చివరి దశలో జరగాలిః సీజేఐ ఎన్వీ రమణ
Chief Justice Of India Nv Ramana
Follow us on

CJI NV Ramana in Curtain Raiser Conclave:  ప్రతిరోజూ సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు లేకుండా మనిషి ఉండడు.. కోర్టులకు వచ్చేముందే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ సమయంలో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని చెప్పారు. మహాభారతంలో కృష్ణ పరమాత్మ కౌరవులకు, పాండవులకు మధ్యవర్తిత్వం చేశాడని సీజేఐ రమణ గుర్తు చేశారు.

హైదరాబాద్ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ సదస్సులో ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎవరికైనా వ్యక్తి గత జీవితంలో సమస్యలు వస్తే వారిని మనం దూరంగా పెడుతాం. సమస్యలు వస్తే కోర్టులకు వస్తారు. కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతుందని చెప్పారు. విస్తృత సంప్రదింపులతో ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. 40 సంవత్సారాల అనుభవంతో చెప్తున్నా.. ఆర్బిట్రేషన్ చివరి దశలో జరగాలని ఎన్వీ రమణ అన్నారు.

అంతర్జాతీయ పారిస్, సింగపూర్, లండన్, హాంగ్‌కాగ్‌లలో ఆర్బిట్రేషన్ సెంటర్‌లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడం చాలా సంతోషం. సింగపూర్, సీజేతో కూడా మాట్లాడాను. వారి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలు, ఐటి కంపెనీల సహకారం కూడా ఎంతో అవసరం. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నెంబర్ వన్‌గా ఉందన్నారు  తెలంగాణ ప్రజలు దేన్నైనా స్వాగతిస్తారని సీజేఐ తెలిపారు.

ప్రతి మనిషి జీవితంతో లీగల్ సిస్టం ముడి పడి ఉంటుంది. జూన్‌లో సీఎం కేసీఆర్‌తో సెంటర్ గురించి చర్చించినప్పుడు మంచి సహకారం అందించారు. డిసెంబర్ 18న ఆర్బిట్రేషన్ సెంటర్ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఆర్బిట్రేషన్ సెంటర్‌ను నెలకొల్పడంలో జస్టిస్ హిమా కోహ్లీ సహకారం మర్చిపోలేను’’ అని పేర్కన్నారు. ఆస్తుల పంపకాలను కుటుంబ సభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. సాధ్యమైనంతవరకు మహిళలు మధ్యవర్తిత్వంలో వివాదాలు పరిష్కరించుకోవాన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు హైదరాబాద్‌ సరైన వేదిక అని చెప్పారు.

Read Also…  Konijeti Rosaiah: అజాత శత్రువు.. ఆర్థిక నిపుణుడు.. రాజకీయ ప్రజ్జాశీలి.. రోశయ్య మృతిపట్ల ప్రముఖుల సంతాపం