Hunger Deaths: ఆకలి చావులు.. ఆహారంలేక భర్త, తల్లి మృత్యువాత! ఇంటి నుంచి దుర్వాసన రావడంతో..

|

Feb 14, 2023 | 6:44 PM

కొందరి వ్యక్తుల చేతుల్లో సంపద కుప్పలుతెప్పలుగా పోగవుతుంటే.. మరో వైపు దేశంలో ఆకలి చావులు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ కుటుంబం తినడానికి తిండిలేక ఆకలితో ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాలు..

Hunger Deaths: ఆకలి చావులు.. ఆహారంలేక భర్త, తల్లి మృత్యువాత! ఇంటి నుంచి దుర్వాసన రావడంతో..
Hunger Deaths In Tamil Nadu
Follow us on

కొందరి వ్యక్తుల చేతుల్లో సంపద కుప్పలుతెప్పలుగా పోగవుతుంటే.. మరో వైపు దేశంలో ఆకలి చావులు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ కుటుంబం తినడానికి తిండిలేక ఆకలితో ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాలు కోల్పోయిన భర్త, తల్లి మృతదేహాలను ఓ మహిళ వారం రోజులపాటు ఇంట్లోనే ఉంచింది. తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఈరోడ్‌ జిల్లా కోపిచెట్టిపాళ్యంలోని వండిప్పేట్టై కుమణన్‌ వీధిలో శాంతి (60), ఆమె భర్త మోహనసుందరం, తల్లి కనకాంపాల్ (80), మానసిక దివ్యాంగుడైన కుమారుడు శరవణకుమార్‌ (34), కుమార్తె శశిరేఖతో నివాసం ఉంటున్నారు. కొంతకాలం క్రితం శశికేఖకు వివాహం కాగా గంగయ్యతో అత్తారింటికి వెళ్లింది. శశిరేఖకు పెళ్లయ్యేంత వరకు కూలీ పనులు చేసి తన ను పోషించేది. వివాహానంతరం కుటుంబ పోషణ కష్టంగా మారింది.

తిండి లేక పస్తులుంటూ అప్పుడప్పుడూ చుట్టుపక్కలవారు పెడుతున్న ఆహారంతో జీవించేవారు. ఈ నేపథ్యంలో శాంతి నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటిని సోదా చేయగా దిగ్ర్భాంతి కరమైన సన్నివేశం కనిపించింది. ఆరు రోజుల క్రితం మోహనసుందరం మృతి చెందగా, రెండు రోజుల క్రితం కనకాంబాళ్‌ తిండిలేక మృతి చెందినట్లు శాంతి తెల్పింది. మృతదేహాలను ఖననం చేయడానికి కూడా స్తోమత లేకపోవడంతో మృతదేహాలను ఇంట్లోనే ఉంచినట్లు ఆమె పోలీసులకు తెల్పింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం అనంతరం ఖననం చేశారు. శాంతి కూడా తిండిలేక ఎముకల గూడులా ఉన్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.