Corona Mata Temple: ‘క‌రోనా మాతా.. కాపాడ‌మ్మా, శాంతించ‌మ్మా’.. మ‌హమ్మారికి గుడిక‌ట్టి పూజ‌లు చేస్తున్న గ్రామ‌స్తులు

|

Jun 12, 2021 | 5:20 PM

కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసింది. ఎందరి ప్రాణాలనో బలితీసుకుంది. ఈ బాధల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ....

Corona Mata Temple: క‌రోనా మాతా.. కాపాడ‌మ్మా, శాంతించ‌మ్మా.. మ‌హమ్మారికి గుడిక‌ట్టి పూజ‌లు చేస్తున్న గ్రామ‌స్తులు
Corona Mata Temple
Follow us on

కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసింది. ఎందరి ప్రాణాలనో బలితీసుకుంది. ఈ బాధల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ కొంతమంది ఆ మహమ్మారికే పూజలు చేస్తున్నారు. కోవిడ్ బారి నుంచి రక్షించాలని వేడుకుంటూ ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ గ్రామ ప్రజలు కరోనా మాతకు పూజలు చేస్తున్నారు. వేపచెట్టు కింద దేవాలయాన్ని నిర్మించి శాంతించాల‌ని అమ్మవారిని వేడుకుంటున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. కరోనా బారి నుంచి తమను దైవమే కాపాడుతుందని నమ్ముతున్నారు ఉత్తర్​ప్రదేశ్​ ప్రతాప్​గఢ్ జిల్లా​లోని శుక్లాపూర్ గ్రామవాసులు. అందుకే.. వేపచెట్టు కింద ‘కరోనా మాత’ ఆలయాన్ని వారు నిర్మించుకున్నారు. వైరస్​ బారిన పడకుండా చూడాలని పూజ‌లు చేస్తున్నారు. మొక్కులు మొక్కుతున్నారు. వైరస్​ నుంచి మమ్మల్ని ఆ దేవతే కాపాడుతుందని నమ్ముతున్నామ‌ని గ్రామానికి చెందిన ఓ మ‌హిళ చెప్పారు. అందుకే అందరం కలిసి కరోనా మాత గుడి ఏర్పాటు చేసిన‌ట్లు వివ‌రించారు. కొంతమంది గ్రామస్తులు విరాళాలు సేకరించి ఈ ఆల‌యాన్ని నిర్మించారు. ఆల‌యానికి వ‌చ్చే ప్ర‌జ‌లు మాస్క్ ధరించడం, భౌతిక‌ దూరాన్ని కొనసాగించడం వంటి కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని కోరుతున్నారు ఆల‌య నిర్వాహ‌కులు. గ్రామస్తులు ఇప్పుడు ఆలయంలో ప్రతిరోజూ ప్రార్థనలు చేస్తూ ప్రజలకు భద్రత కల్పించడానికి క‌రోనా దేవత ఆశీర్వాదం కోరుతున్నారు. ఇదిలావుండగా, ఆలయంలో ప్రజలు ప్రార్థన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కాగా కర్ణాటక చమరాజనగర జిల్లా కొల్లేగాలా తాలుకాలోని మధువానహల్లి గ్రామంలో కూడా ‘కరోనా మారమ్మ’ మందిరాన్ని నిర్మించారు. అందులో ఓ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి.. పూజ‌లు చేస్తున్నారు.

Also Read: ఇన్ని పండ్లు ఒకే చోట‌.. పండుగే పండుగ.. ఏనుగు ఎంజాయ్ చేస్తూ ఎలా తినిందో చూడండి

ఆంధ్ర‌ప్రదేశ్‌లో కొత్తగా 6,952 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా