బెడ్‌పై పైథాన్‌..దానికదే భలే ప్లేస్‌..!

|

Aug 20, 2019 | 3:42 PM

మీరేప్పుడైనా పామును అత్యంత దగ్గర చూశారా..? అది కూడా ఓ పాము మీ మంచంపై చేరితే..ఓ సారి ఊహించుకోండి..! వామ్మో పామేంటీ.. మంచం మీదేంటి ? అనుకుంటున్నారా..?  బెడ్‌రూమ్‌ గోడమీద బల్లి కనబడితేనే భయంతో నిద్రపట్టదు. అటువంటిది..బెడ్‌పై పామును ఊహించుకుంటే..ఇక అంతే..కానీ, మంచంపై కెమెరాకే ఫోజులిస్తూ కనిపిస్తున్నపైథాన్‌ ఫోటోలు   కొన్ని సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. క్వీన్సాండ్‌లోని స్నేక్‌ ఫ్రెండ్‌ సొసైటీ సభ్యుడు ఒకరు బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్నస్నేక్‌ ఫోటోలను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. అందులోని గ్లాస్‌ […]

బెడ్‌పై పైథాన్‌..దానికదే భలే ప్లేస్‌..!
Follow us on

మీరేప్పుడైనా పామును అత్యంత దగ్గర చూశారా..? అది కూడా ఓ పాము మీ మంచంపై చేరితే..ఓ సారి ఊహించుకోండి..! వామ్మో పామేంటీ.. మంచం మీదేంటి ? అనుకుంటున్నారా..?  బెడ్‌రూమ్‌ గోడమీద బల్లి కనబడితేనే భయంతో నిద్రపట్టదు. అటువంటిది..బెడ్‌పై పామును ఊహించుకుంటే..ఇక అంతే..కానీ, మంచంపై కెమెరాకే ఫోజులిస్తూ కనిపిస్తున్నపైథాన్‌ ఫోటోలు   కొన్ని సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. క్వీన్సాండ్‌లోని స్నేక్‌ ఫ్రెండ్‌ సొసైటీ సభ్యుడు ఒకరు బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్నస్నేక్‌ ఫోటోలను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. అందులోని గ్లాస్‌ హౌజ్‌ బెడ్‌రూమ్‌లోని మంచంపై భారీ పొడవైన కొండచిలువ ఒకటి పడుకుని ఉంది. లైట్‌ కలర్‌లో ఉన్న అతి సున్నితమైన బెడ్‌షీట్‌పై ఆ పైథాన్‌ హాయిగా సేదాతీరుతోంది. పైథాన్‌ని గమనించిన ఇంటి యజమాని వెంటనే స్నేక్‌ క్యాచర్‌కి సమాచారం అందించారు. సదరు స్నేక్‌ క్యాచర్‌ క్యాప్చర్‌ చేసిన ఆ పోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అదృష్టవశాత్తు పాము కిందపడిన టైమ్‌లో ఆ మంచంపై ఎవరూ  లేకపోవడంతో ప్రమాదం తప్పిన్నట్లుగా తెలుస్తోంది. అయితే, క్వీన్సాండ్‌ ప్రాంతం ఎత్తైన కొండ కోనలతో కూడిన ప్రాంతంకావటంతో కొండచిలువ ఇంటి పైనుంచి కిందపడివుంటుందని స్నేక్‌ క్యాచర్‌ చెబుతున్నాడు. ఇదిలా ఉంటే..బెడ్‌మీద పామును చూసిన నెటిజన్లు మాత్రం ఆ ఫోటోలకు తెగ లైకులు పెడుతున్నారు.