Mumbai: ఆర్థిక రాజధానిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి, 15 మందికి తీవ్రగాయాలు..

|

Jan 22, 2022 | 1:28 PM

Mumbai Fire Accident: ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 20 అంతస్తుల అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి

Mumbai: ఆర్థిక రాజధానిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి, 15 మందికి తీవ్రగాయాలు..
Mumbai Fire Accident
Follow us on

Mumbai Fire Accident: ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 20 అంతస్తుల అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి ఏడుగురు మృతిచెందారు. ఇద్దరు సజీవ దహనం కాగా.. మరో ఐదుగురు ఆసుపత్రిలో మరణించారు. దీంతోపాటు మరో 15 మందికి తీవ్ర గాయలయ్యాయి. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ ముంబైలోని టార్డియో ప్రాంతంలోని కమల నివాస భవనంలోని 18వ అంతస్తులో శనివారం ఉదయం 7 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న 20 అంతస్తుల అపార్ట్మెంట్ భవనంలో ఈ ఘటనప జరిగింది.

ఈ ప్రమాద ఘటనపై బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు వెంటనే స్పందించారు. సమాచారం అందుకున్న వెంటే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి పరుగులు తీశారు. కమల భవనం అపార్ట్మెంట్ వద్దకు 13 ఫైర్ ఇంజన్లు, ఏడు వాటర్ జెట్టీల లతో చేరుకున్న సిబ్బంది వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా.. 15 మంది గాయపడ్డారని తెలిపారు. చాలా మంది శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారందరినీ సమీపంలోని భాటియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో చేరినవారిలో కొంతమందికి ఆక్సిజన్ సపోర్ట్ అవసరమైందని వైద్యులు తెలిపారు.

మంటలు అదుపులోకి వచ్చినా పెద్ద ఎత్తున పొగలు వస్తున్నట్లు ముంబై మేయర్ కిషోరీ పెడ్నేకర్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పెడ్నెకర్ వివరించారు. ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియాల్సి ఉందన్నారు. అపార్ట్‌మెంట్ వాసులు నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Also Read:

NRI Investments: ఎన్ఆర్ఐల చూపు వాటి వైపే.. భారత్‌లో ఆ రంగాల్లో భారీగా పెరుగుతున్న పెట్టుబడులు

Budget 2022: బడ్జెట్ 2022లో ఆటో రంగంపై భారీ అంచనాలు.. మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటన చేయనున్నారు?