Opposition Party Meeting: విపక్షాలు నిజంగా ఐక్యంగా ఉండగలవా.. పాట్నా సమావేశానికి ముందు సవాళ్లు ఇవే..

2014లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మోదీని గద్దె దించాల్సిందే..ఇదే విపక్షాలు సింగిల్‌ ఎజెండా..అందుకే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అవుతున్నాయి. బీజేపీ సర్కారును సాగనంపేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు..చేపట్టాల్సిన చర్యల గురించి కూలంకషంగా చర్చించడానికి సిద్ధమయ్యాయి. అందుకే ఏకతాటిపైకి వస్తున్నాయి. అందుకోసం పెద్దాయన నితీష్‌ కుమార్‌ అడ్డా పాట్నాను అందుకు సెంటర్‌ పాయింట్‌గా సెలెక్ట్ చేసుకున్నాయి. మోదీని ఎదుర్కొంనేందుకు ఎలాంటి వ్యూహాలు రచించాలి.

Opposition Party Meeting: విపక్షాలు నిజంగా ఐక్యంగా ఉండగలవా.. పాట్నా సమావేశానికి ముందు సవాళ్లు ఇవే..
Patna Political Meeting

Updated on: Jun 22, 2023 | 7:52 PM

ఎన్నికల టైం దగ్గరపడేకొద్దీ విపక్ష పార్టీలు దూకుడు పెంచాయి. 2024 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి విపక్ష శిబిరంలో రాజకీయ సందడి కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా చర్చనీయాంశమైన ప్రతిపక్ష ఐక్యత.. రేపు అంటే జూన్ 23న దాని మొదటి, అతి ముఖ్యమైన లిట్మస్ టెస్ట్ జరగబోతోంది. శుక్రవారం పాట్నాలో పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు కలుసుకోనున్నారు. రాహుల్ గాంధీ నుంచి మొదలు మమతా బెనర్జీ వరకు అందరూ జట్టు కట్టనున్నారు. విపక్షాల టార్గెట్ ఒక్కటే – బీజేపీని ఆపడం, మోదీని ఓడించడం. ఒకరిపై మరొకరు సెటైర్లు.. ఒకరినొకరు అప్పుడప్పుడూ కవ్వింపులు, విమర్శలు.. కలికట్టుగా ఉన్నట్లే కనిపిస్తూనే కత్తులు దూసుకోవడం మనం నిత్యం జాతీయ రాజకీయాల్లో చూస్తున్నాం. వీంతా ఏకతాటిపైకి వస్తున్నారావడం అన్నదే పెద్ద ప్రశ్న. అయితే ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఐక్యతలో అనేక వివాదాలు ఉన్నాయి.

గట్టిగా గాలి ఇస్తే అది పెద్ద రాజకీయ అగ్నిగా మారుతుంది. విపక్షాల ఐక్యత గురించి నిరంతరం మాట్లాడే అరవింద్ కేరీవాల్.. మొదట సత్యేందర్ జైన్, ఆ తర్వాత మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలని మాట్లాడిన అరవింద్ కేరీవాల్ రాజస్థాన్‌కు వెళ్లడం ద్వారా ఆయన వైపు నుంచి అతిపెద్ద రాజకీయ దాడి జరిగిందని అర్థం చేసుకోవచ్చు.

సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఢీ కొట్టేందకు విపక్షాలు సింగిల్‌ ఎజెండాతో రెడీ అవుతున్నాయి. బీజేపీ ప్రభుత్వంపై అన్ని పార్టీలు కలిసి పోరాడేందుకు ఒకటే ప్లాన్‌తో, నిర్ణయాలు తీసుకునేందుకు పాట్నాను వేదికగా మార్చుకుంటున్నాయి. బీహార్ సీఎం నితీష్‌ కుమార్‌ సెంటర్‌ పాయింట్‌గా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ ప్రతిపక్షాల సమావేశం ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు సాగుతుందని తెలుస్తోంది.

కేజ్రీవాల్ గత ట్రాక్ రికార్డ్ ఇదే..

దేశంలో 75 ఏళ్లు పాలించిన బీజేపీ, కాంగ్రెస్ అనే రెండు పార్టీలు మాత్రమే ఉన్నాయని రాజస్థాన్ గడ్డ నుంచి కేజ్రీవాల్ విమర్శలు చేశారు. నేడు మన దేశం పేద, వెనుకబడిన, మన దేశంలోని ప్రజలు చదువుకోని వారైతే దానికి ఈ రెండు పార్టీలే కారణమన్నారు. గెహ్లాట్ గురించి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. గెహ్లాట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వసుంధరపై అవినీతి ఆరోపణలు చేసేవారని, అయితే అధికారంలోకి వచ్చాక ఇద్దరూ అన్నదమ్ములయ్యారని అన్నారు. సచిన్ పైలట్ ‘వసుంధరను అరెస్టు చేయి’ అని గోల చేస్తున్నారని, కానీ ఆమె తన సోదరి అని గెహ్లాట్ అంటూన్నారని కేజ్రీవాల్ విమర్శించారు.

కేజ్రీవాల్, కాంగ్రెస్ మధ్య రాజకీయ శత్రుత్వం

కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ అల్టిమేటం ఇచ్చింది. ఢిల్లీ ఆర్డినెన్స్‌కు సంబంధించి ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతు లభించకపోతే రేపు పాట్నా సమావేశాన్ని అరవింద్ కేజ్రీవాల్ బహిష్కరించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సభ ప్రారంభం కాకముందే పెద్ద అడ్డంకి తెరపైకి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఇదే మొదటిసారి కాదు. కేజ్రీవాల్- కాంగ్రెస్ పార్టీ మధ్య  రాజకీయ విబేధాలు చాలా ఉన్నాయి. ప్రతిసారీ కేజ్రీవాల్- కాంగ్రెస్‌కు పెద్ద సవాలుగా మారుతున్నాడు. దీంతోపాటుగుజరాత్, పంజాబ్‌లలో రెండు రాజకీయ పార్టీలను కూడా రాజకీయ శత్రుత్వం ఉంది.

మమత, కాంగ్రెస్ మధ్య కూడా హోరాహోరీ పోరు..

కాంగ్రెస్ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సక్యత అంతగా లేదు. నిజానికి మమతా బెనర్జీ రాజీకి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీఎంసీ దాడులపై ఆ పార్టీ అధిష్టానం ఆందోళనతో ఉంది. ఇంది కూడా విపక్షాల ఐక్యత కసరత్తు మధ్యలో బ్రేకులు పడే ఛాన్స్ ఉంది.

కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ మధ్య..

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న  సమయంలో విపక్షల సమావేశం జరుగుతుండటం.. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం అందనట్లుగా సమాచారం. ఇక్కడ కూడా కాంగ్రెస్- కారు పార్టీకి మధ్య అంతగా పెద్దగా టచ్ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఇప్పుడు కాంగ్రెస్‌కు సవాలు కేవలం మమత లేదా కేజ్రీవాల్ నుంచే మాత్రమే కాదు. ప్రస్తుతం కేరళలో ప్రభుత్వాన్ని నడుపుతున్న వామపక్షాలు, వారితో దేశంలోని పురాతన పార్టీకి ఉన్న సంబంధం కొత్తది కాదు. కానీ అంతగా ఫ్రెండ్లీ టచ్ మాత్రం లేదు. అంటే బెంగాల్‌లో టీఎంసీతో కొనసాగుతున్న పరిస్థితి.. కేరళలోనూ ఇదే పరిస్థితి. రేపటి విపక్షాల ఐక్య సమావేశంలో సీతారాం ఏచూరి ఢీకొనడం పెద్ద విషయం. ఇలాంటి ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ అభిప్రాయాల‌తో ఎంత వ‌ర‌కు ఏకీభవిస్తార‌న్న‌ది.. దానికి ఎంత ప్లేస్ ఇస్తార‌నేది పెద్ద ప్ర‌శ్న‌.

మరిన్ని జాతీయ వార్తల కోసం