Happy New Year 2023: మీ ప్రియమైన వారికి వేరే భాషల్లో ఇలా నూతన ఏడాది శుభాకాంక్షలు చెప్పారంటే.. దిల్ ఖుష్!
2023కు ఇలా సరికొత్తగా మీ సన్నిహితులకు, ప్రియమైనవారికి చెప్పేయండి. హిందీ నుంచి పోర్చుగీస్ వరకు దాదాపు 25 భాషల్లో కొత్త ఏడాదికి స్పెషల్ విషెస్ చెప్పడానికి రెడీ అవ్వండి..
కొత్త సంవత్సరంలో కొత్తకొత్తగా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? ఐతే మీకు మేం సహాయం చేస్తారం. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే మీరు ఇప్పటి వరకు వచ్చిన కొత్త ఏడాదుల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి ఉంటారు. 2023కు ఇలా సరికొత్తగా మీ సన్నిహితులకు, ప్రియమైనవారికి చెప్పేయండి. హిందీ నుంచి పోర్చుగీస్ వరకు దాదాపు 25 భాషల్లో కొత్త ఏడాదికి స్పెషల్ విషెస్ చెప్పడానికి రెడీ అవ్వండి..
ఏ భాషలో ఏ విధంగా కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు చెబుతారంటే..
హిందీలో.. నవ్ వర్ష్ కి శుభకమ్నాయెన్
సంస్కృతం.. సుఖదం నూతన్‌వర్షమ్
పంజాబీ.. నవ సాల్ ముబారక్
తమిళం.. పుట్టాంటు వాల్టుక్కల్
తెలుగు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు
గుజరాతీ.. సాల ముబారక
మరాఠీ.. నవీన్ వర్ష్‌చ్యా శుభేచ్ఛా
ఉర్దూ.. నయా సాల్ ముబారక్ హో
కొరియన్ .. సాహే బోగ్ మాన్-ఐ బాడ్-యూసెయో
ఫ్రెంచ్.. బోన్నె అన్నే
జర్మన్.. ఫ్రోహెస్ న్యూస్ జహ్ర్
ఇటాలియన్.. ఫెలిస్ అన్నో నువో (బున్ అన్నో)
స్పానిష్.. ఫెలిజ్ అనో నువో
డానిష్.. గాడ్ట్ నైటర్
డచ్.. గెలుక్కిగ్ నియువ్జార్
ఫిన్నిష్.. హ్యువా ఊత్త వువొత్త
చైనీస్ మాండరిన్.. షిన్ నెయిన్ కెఐ లా
చైనీస్ కాంటోనీస్.. శాన్ నిన్ ఫై లోక్
జపనీస్ (అర్ధరాత్రికి ముందు)..యోయ్ ఓటోషి ఓ
జపనీస్ (అర్ధరాత్రి తర్వాత).. అకేమాషైట్ ఒమెడెటౌ గోజైమాసు