Without Ration Card : రేషన్ కార్డు లేకుండా ఉచితంగా బియ్యం, గోధుమలు పొందడం ఎలా..? ఇలా చేస్తే మీరు కూడా అర్హులవుతారు..?

|

Jun 07, 2021 | 7:23 PM

Without Ration Card : కరోనా కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ 9వ సారి దేశాన్ని ఉద్ధేశించి ప్రసంగించారు. కరోనాకు

Without Ration Card : రేషన్ కార్డు లేకుండా ఉచితంగా బియ్యం, గోధుమలు పొందడం ఎలా..? ఇలా చేస్తే మీరు కూడా అర్హులవుతారు..?
Ration
Follow us on

Without Ration Card : కరోనా కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ 9వ సారి దేశాన్ని ఉద్ధేశించి ప్రసంగించారు. కరోనాకు వ్యతిరేకంగా చేసిన పోరాటం, రెండో వేవ్‌ను ఎదుర్కోవటానికి చేసిన ప్రయత్నాలు, ఆక్సిజన్ డిమాండ్, సరఫరా, కరోనా టీకా, 80 కోట్లకు పైగా దేశస్థులకు ఉచిత ఆహార ధాన్యాలు వంటి అంశాల గురించి ప్రసంగించారు. దేశవాసులకు ఉచిత రేషన్ ప్రకటించిన ప్రధాని మోదీ ప్రధాన్ మంత్రి గారిబ్ కల్యాణ్ అన్నా యోజనను దీపావళి వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. మహమ్మారి ఉన్న ఈ సమయంలో పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రకటించారు. నవంబర్ నాటికి 80 కోట్లకు పైగా దేశస్థులకు ప్రతి నెలా ఉచిత ఆహార ధాన్యాలు లభిస్తాయని స్పష్టం చేశారు.

రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ పథకం ప్రయోజనం లభిస్తుంది..
అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈసారి గరీబ్ కల్యాణ్ అన్నా యోజన కింద రేషన్ కార్డు లేని వారికి కూడా ఉచిత ఆహార ధాన్యాలు లభిస్తాయి. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవటానికి వారు ఆధార్ కార్డు ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ విషయంలో ప్రధాని మోదీ ప్రకటించిన తరువాత ఎవరికైనా రేషన్ కార్డు లేకపోతే, అతను తన ఆధార్ తీసుకొని రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుందని, ఆ తర్వాత అతనికి స్లిప్ ఇస్తామని ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ స్లిప్ చూపించిన తరువాత వారికి ఉచిత ఆహార ధాన్యాలు లభిస్తాయని తెలిపారు.

పేద కూలీలకు ఉచిత రేషన్ ప్రయోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని కోరారు. గరీబ్ కల్యాణ్ అన్నా యోజన కింద లభించే ఉచిత 5 కిలోల ఆహార ధాన్యాలు రేషన్ కార్డులో లభించే ఆహార ధాన్యాల కోటాతో పాటు ఉంటాయి. అంటే రేషన్ కార్డులో ఇప్పటికే ఆహార ధాన్యాలు పొందిన వారికి 5 కిలోల ఎక్కువ రేషన్ లభిస్తుంది. దీని కోసం వారు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మహమ్మారి సమయంలో ఏ పేదలూ ఆకలితో నిద్రపోకూడదనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. అంతకుముందు కరోనా రెండో వేవ్‌ మధ్యలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రెండు నెలలు ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది దానిని ఇప్పుడు నవంబర్ వరకు పొడిగించారు.

SBI Clerk Jobs 2021: ఎస్‌బీఐలో 5454 ఉద్యోగాలకు త్వరలో పరీక్ష… ఎగ్జామ్‌ విధానం ఎలా ఉంటుంది..?

Coffee Disadvantages: మరీ ఎక్కువగా కాఫీ తాగుతున్నారా? మీకో పిడుగులాంటి వార్త… లేటెస్ట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Close SBI Account : మీరు మీ బ్యాంక్ ఖాతాను క్లోజ్ చేయాలనుకుంటున్నారా..! అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే సులువుగా చేయండి..