
బస్సులు, బైక్‌లు, కార్లు, ఓడలు.. వీటన్నింటికంటే కూడా విమానాలే సేఫ్. అందులో నో డౌట్. కాకపోతే, ఛార్టెడ్ విమానాల కంటే కమర్షియల్ ఫ్లైట్లే మరింత సేఫ్. ఎందుకని? పెద్ద పెద్ద విమానాలు, కమర్షియల్ ఫ్లైట్స్‌లో ఉండే సేఫ్టీ ఫీచర్స్ కంటే కూడా.. ఇలాంటి ఛార్టెడ్ జెట్స్‌లో ఉండే భద్రతా ప్రమాణాలు తక్కువగా ఉంటాయా? డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణించింది కూడా చిన్న విమానమే. గతంలో ఎంతో మంది ప్రముఖులు చనిపోయింది కూడా ఇలాంటి ఛార్టెడ్ ఫ్లైట్లు, హెలికాప్టర్లలోనే. ఎందుకని.. చిన్న విమానాల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి? అజిత్ పవార్ ప్రయాణ సమయంలో, సరిగ్గా ప్రమాదానికి ముందు ఏం జరిగింది? జనవరి 28.. ఉదయం 8 గంటల 10 నిమిషాలు.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం ఎక్కిన సమయం. ఉదయం.. 8 గంటల 42 నిమిషాలు.. అజిత్ పవార్ విమానానికి ప్రమాదం జరిగిన సమయం. సరిగ్గా 32 నిమిషాల్లోనే.. ప్రయాణం ప్రారంభించడం, మజిలీ చేరకుండానే ఆ ప్రయాణం శాశ్వతంగా ముగియడం జరిగిపోయింది. అంతా సాఫీగా జరిగి ఉంటే ఆ ప్రయాణం అరగంటలోనే ముగియాల్సింది. కాని, ప్రమాదం 8 గంటల 42 నిమిషాలకు జరిగింది. మిగిలిన ఆ కొన్ని నిమిషాల్లో ఏం జరిగింది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని భయంతో గడిపారా? ఫ్లైట్ యాక్సిడెంట్ జరగడానికి 12 నిమిషాల ముందు.. పైలెట్లు ఓ ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. అది ఆ విమానంలో ప్రయాణిస్తున్న అజిత్ పవార్‌కు సహా మిగిలిన...