Corona Vaccine: దేశంలో పది నెలలుగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌.. ఇప్పటి వరకు ఎంత మంది టీకా తీసుకున్నారో తెలుసా..?

|

Nov 13, 2021 | 2:31 PM

Corona Vaccine: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. కరోనా కట్టడికి దేశంలో..

Corona Vaccine: దేశంలో పది నెలలుగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌.. ఇప్పటి వరకు ఎంత మంది టీకా తీసుకున్నారో తెలుసా..?
Follow us on

Corona Vaccine: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. కరోనా కట్టడికి దేశంలో లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షలు విధించడంతో కట్టడిలోకి వచ్చింది. ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే వంద కోట్లు దాటిన కరోనా టీకాలు.. ఇంకా ఎక్కువ సంఖ్యలో వేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. 2021 జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్‌.. ముందుగా ఆరోగ్య కరా్యకర్తలకు, ఫ్రంట్‌లైన్‌ కార్మికులకు అందించారు. 18 ఏళ్లకుపైబడిన వారందరికి టీకాలు వేస్తున్నారు. ఈ 10 నెలల్లో రెండు డోసుల వ్యాక్సిన్‌ చాలా మందికి వేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. భారతదేశంలో 80 శాతం మంది మొదటి డోసు పొందగా, 38 శాతం మంది సెకండ్‌ డోస్‌ వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే ఈ గణాంకాలు నిన్నటి వరకు. శుక్రవారం నుంచి టీకాల సంఖ్య పెరిగింది. అయితే మొదటి డోసు వేసుకుని, రెండో డోసు తీసుకోని వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

హర్‌ ఘర్‌ దస్తక్‌ ప్రచారంపై కేంద్రం ఒక వెబ్‌మినార్‌ సందర్భంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అండ్‌ అండర్‌ సె్రటరీ మనోహర్‌ అగ్నానీ మాట్లాడుతూ.. అర్హులైన వారిలో కనీసం 90 శాతం మంది నవంబర్‌ 30 నాటికి వ్యాక్సిన్‌ పొందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇంకా ఎటువంటి డోస్‌లు తీసుకోని వారి కోసం ఇంటింటికి తిరుగుతూ టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నుంచి ఘర్‌ ఘర్‌ దస్తక్‌ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు దేశంలోని అర్హతగల జనాభాలో 80 శాతం మొదటి డోసు పొందారని, 38 శాతం రెండో డోసులు పూర్తి చేసుకున్నారని అన్నారు. పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్‌ శాతాన్ని పెంచేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

India Corona: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు.. నిన్న ఎన్నంటే..?

India Coronavirus: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?