
అప్పట్లో యూపీలో బీపీలు రేపిన ఏనుగు పార్టీ మాయావతి ఇప్పుడెక్కడున్నట్టు? బెంగాల్‌లో రెండాకుల గుర్తు మమతాబెనర్జీ ఫ్యూచర్ ఏమైనట్టు? చీపురుకట్టతో ఊడ్చేస్తానంటూ ఢిల్లీ గద్దెనెక్కిన కేజ్రీవాల్ గురితప్పిన వైనమేంటి? సౌత్‌లో ఢిల్లీని ఎదిరించి సూపర్‌స్టార్‌గా ప్రకటించుకున్న ఎంకే స్టాలిన్, మరాఠీ గడ్డ మీద చెలరేగిన ఉథ్థవ్ థాక్రే.. బిహార్‌లో నితీశ్‌కుమార్, ఒడిషాలో నవీన్ పట్నాయక్.. ఒక్కొక్కరు యోధానుయోధులు. బీజేపీకి కొరకరాని కొయ్యలు. ఇప్పుడు వీళ్లందరి పునాదులు కదిలిపోయి, పూలు అమ్ముకున్నచోటే కట్టెలమ్ముకోవాల్సిన విపత్కర పరిస్థితి. కనీసం ఢిల్లీ వైపు కన్నెత్తి చూడ్డానిక్కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. ప్రాంతీయ పార్టీల ఐక్యత వర్ధిల్లాలి అని ఢిల్లీ దాకా పొలికేక పెట్టిన ఈ కటౌట్లన్నీ ఇప్పుడు కుప్పకూలి కనిపిస్తున్నాయంటే.. మూల కారణం ఏదై ఉంటుంది? లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, NDA మిత్రపక్షంగా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన NCPI. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా… త్రిపుర ఎన్నికల్లో పోటీచేసినా అసెంబ్లీలో కనీసం ఖాతా తెరవలేని ఒక అనామక పార్టీ, నోటా కంటే తక్కువ ఓట్లొచ్చి డిపాజిట్లు గల్లంతైన జీరోసైజు పార్టీ.. ఇప్పుడు కేంద్రంలో ఎన్‌డీఏ మేజర్ పార్ట్‌నర్‌గా కొత్తగా అవతారమెత్తింది. వాటే మిరాకిల్ కదా? బెంగాల్‌లో అపోజిషన్‌ను చిత్తుచెయ్యడానికి బీజేపీ టాప్ కమాండర్లు ఆడిన పవర్‌గేమ్ క్లయిమాక్స్ ఇది. అసెంబ్లీ...