దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. దీంతో పాటు కరోనా రోగులకు ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఆస్పత్రుల్లో బెడ్స్ లేక కూడా రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నందూర్బార్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపడుతున్న డాక్టర్ రాజేంద్ర భరుద్.. అందరి మన్ననలు పొందుతున్నారు. నందూర్బార్ జిల్లాలో 150 పడకల ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పేలా చేశారు. దీంతో నిమిషానికి 2400 లీటర్ల ఆక్సిజన్ అందుతోంది. ఈ సమయంలో జిల్లాలో పాజిటివిటీ రేటు కూడా చాలా తక్కువగా ఉంది. దీంతో వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడానికి మధ్యప్రదేశ్, గుజరాత్‌ల నుంచి ప్రజలు వస్తున్నారు. అయితే గత ఏడాది కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత నిధులు సేకరించి జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన రాజేంద్ర భరుద్.. ప్రస్తుతం 2400 లీటర్ల ఆక్సిజన్ అందుతోంది. అయితే ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర విపత్తు సహాయ నిధులు, సీఎస్‌ఆర్ సహాయంతో నిధులు సేకరించినట్లు ఆయన తెలిపారు. ఇలా ఆ జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా ముందస్తుగా ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతో రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు.
కాగా, మహారాష్ట్రలో కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు తీవ్రంగా నమోదు అవుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదయ్యే జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అయితే కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తోంది. అలాగే నైట్ కర్ప్యూ కూడా అమలవుతోంది. అలాగే మాస్క్ ధరించని వారిపై జరిమానాలు విధిస్తున్నారు అధికారులు.
ఇవీ చదవండి: