తనపై మాజీ కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో అన్ని ఆరోపణల నుంచి విముక్తురాలైన జర్నలిస్ట్ ప్రియా రమణి ఢిల్లీ కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసింది. పని చేస్తున్న స్థలాల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ఇక ఈ తీర్పుతో ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకు వస్తారని ఆశిస్తున్నట్టు ఆమె తెలిపింది. (ఈ కేసులో ఈమెను నిర్దోషిగా కోర్టు పేర్కొంది.) నేను నిందితురాలిగా కోర్టులో నిలబడినా సరే..కానీ నా వాదనే నిజమని కోర్టు విశ్వసించింది అని రమణి పేర్కొంది. ఎం.జె.అక్బర్ వేసిన దావా తనను బెదిరించడానికేనని ఆమె ఆరోపించింది. అలాగే తన (అక్బర్) చేతుల్లో లైంగిక వేధింపులకు గురైన ఇతర మహిళలను కూడా భయపెట్టడానికే ఆయన పరువు నష్టం దావా వేశాడని ఆమె అభిప్రాయపడింది. ఇది..ఈ తీర్పు అమేజింగ్ అని ఆమె అభివర్ణించింది.
కాగా-చాలా సందర్భాల్లో లైంగిక వేధింపులు మూసి ఉన్న తలుపులవెనకే జరుగుతాయన్నది వాస్తవమని, మహిళల్లో చాలామంది సామజిక భయంతోనో, తమ క్యారెక్టర్ దెబ్బ తింటుందన్న ఆందోళనతోనో తమకు కలిగిన అనుభవాలను బయటకు చెప్పుకోలేరని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే పేర్కొన్నారు.
ఇలా ఉండగా తన 41 పేజీల పరువు నష్టం దావాలో ఎం.జె. అక్బర్….దశాబ్దాల తరబడి ఉన్న తన ప్రతిష్ట..ఈ జర్నలిస్ట్ చేసిన ఆరోపణల కారణంగా దెబ్బ తిన్నదని ఆరోపించారు. అలాగే ప్రభుత్వంలోనూ తన పరువు పోయిందన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :
నటుడు సందీప్ నహర్ సూసైడ్ కేసులో భార్య కాంచన్ శర్మపై ఎఫ్ ఐ ఆర్, ముంబై పోలీసుల దర్యాప్తు ముమ్మరం
మాజీ కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ కేసులో జర్నలిస్ట్ ప్రియా రమణి నిర్దోషి, ఢిల్లీ కోర్టు తీర్పు