జమ్మూ కాశ్మీర్.. ఇక స్థానికులకే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు.. హోం శాఖ ఆదేశాలు

| Edited By: Anil kumar poka

Apr 04, 2020 | 1:33 PM

జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఇక స్థానికులకే ఉద్యోగాలు లభించనున్నాయి. మొదట గ్రూప్ 'డీ', నాన్-గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకే రిజర్వేషన్లు కల్పించాలని హోమ్ శాఖ గత మార్చి 31 న ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ..

జమ్మూ కాశ్మీర్.. ఇక స్థానికులకే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు.. హోం శాఖ ఆదేశాలు
Follow us on

జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఇక స్థానికులకే ఉద్యోగాలు లభించనున్నాయి. మొదట గ్రూప్ ‘డీ’, నాన్-గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకే రిజర్వేషన్లు కల్పించాలని హోమ్ శాఖ గత మార్చి 31 న ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. ఆ తరువాత ఇక్కడి బీజేపీ నేతల నుంచి వఛ్చిన నిరసన నేపథ్యంలో.. ఈ ఉత్తర్వులను సవరించారు. గ్రూప్ ‘ఏ’, గ్రూప్ ‘బీ’కేటగిరీలలో సీనియర్ స్థాయి పోస్టులతో సహా అన్ని పోస్టులకు స్థానికులకే రిజర్వేషన్ కల్పించాలని వీటిలో పేర్కొన్నారు.  డామిసిల్ (లోకల్) సర్టిఫికెట్లను జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్లకు కల్పించారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని కేంద్రం రద్దు చేసిన అనంతరం.. 2010 నాటి ‘జమ్మూ కాశ్మీర్ సివిల్ సర్వీసెస్ డీసెంట్రలైజేషన్ అండ్ రిక్రూట్ మెంట్ యాక్ట్’ ని మార్చి 31 న హోంశాఖ సవరించింది. శాశ్వత నివాసి అన్న పదం స్థానే జముకాశ్మీర్ స్థానికుడు అనే పదాన్ని చేర్చింది. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో 15 ఏళ్ళ పాటు నివసించిన ఏ వ్యక్తి అయినా.. లేదా ఇక్కడే ఏడు సంవత్సరాల పాటు 10, 12 తరగతుల పరీక్షలకు హాజరైనవారో డామిసిల్స్ అని ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి.