Flag Code of India 2022: ఆజాదీ కా మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని సూచిస్తోంది. ఈ సందర్భంగా మువ్వన్నెల జెండా పండగను ఘనంగా జరుపుకోవాలని మోడీ సర్కార్ సూచించింది. అయితే జాతీయ జెండా ఎగురవేయాలని కొన్ని నియమ నిబంధనలున్నాయి. వాటిని పాటిస్తూనే జెండా ఎగురవేయాల్సి ఉంటుంది. లేకపోతే త్రివర్ణ పతాకాన్ని అవమానించినట్లే. జాతీయ జెండాను ఉపయోగించే సమయంలో ఫ్లాగ్ కోడ్ 2022 రూల్స్ పాటించడం తప్పనిసరి. ఒక వేళ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే చట్టం ప్రకారం శిక్షలు వేయడమే కాకుండా జరిమానాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. జాతీయ జెండాను అవమానించినట్లయితే కనీసం మూడు సంవత్సరాల పాటు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని నిబంధనలు చెబుతున్నాయి.. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు భారత జాతీయ పతాకం ప్రతిబింబం. మన జాతీయ ప్రతిష్టకు చిహ్నమైన ఈ జాతీయ పతాకంపై సార్వజనీన గౌరవాదరాలు, విధేయత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. భారత ప్రజల భావోద్వేగాలలో, వారి హృదయాల్లో ఈ పతాకానికి ఒక విశిష్ట, ప్రత్యేక స్థానం ఉంది. జాతీయ పతాకాన్ని ఎగురవేయడం, ఉపయోగించడం అనేవి జాతీయ ప్రతిష్టకు అవమాన నిరోధకచట్టం-1971, భారత పతాకస్మృతి -2002 కులోబడి ఉంటాయి.
జాతీయ జెండా ఎగురవేసే సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలి?:
☛ జాతీయ జెండాను గౌరవప్రదంగా చూసుకోలి.
☛ జెండా ఎగురవేసే సమయంలో చిరిగిపోకుండా జాగ్రత్తలు పాటించాలి.
☛ జాతీయ జెండా నలిగిపోకూడదు. జెండా పాతగా ఉండకూడదు.
☛ జాతీయ జెండాపై ఎలాంటి రాతలు ఉండకూడదు. జెండాను ఎగురవేసే సమయంలో ఏ రంగు ఏటువైపు ఉండాలనేది తప్పకుండా తెలిసి ఉండాలి.
☛ కాషాయ రంగు పైకి ఉంటే, ఆకుపచ్చ రంగు దిగువన ఉండాలి. జెండాను ఎట్టి పరిస్థితుల్లో తిరగబడి ఉండకూడదు.
☛ జెండాను సరైన స్థలంలో ఎగరవేయాలి.
☛ జాతీయ జెండాను ఎగరవేసే ఎత్తులో లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో మరే ఇతర జెండా ఎగురవేయకూడదు.
☛ జెండాను ఎలాంటి అలంకరణకు ఉపయోగించకూడదు.
☛ జాతీయ జెండా స్తంభం మీద లేదా జెండాపైన పూలు గానీ, ఆకులు, దండలు ఎలాంటివి పెట్టకూడదు.
☛ జెండాను ఏ వస్తువు మీద కప్పబడి ఉంచకూడదు.
☛ జెండా ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పడేయకూడదు. నీటిపై తేలనీయకూడదు.
☛ జెండాను దుస్తులుగా కుట్టించుకోకూడదు. నడుము కింద భాగంలో చుట్టుకోకూడదు.
మరిన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి