HMPV Virus: ఎప్పుడో పుట్టిన వైరస్.. ఇప్పుడెందుకు పేట్రేగుతోంది..? HMPVకి అంత సీనుందా..

హ్యూమన్‌ మెటాన్యుమో వైరస్. ఇది HMPV ఫుల్‌ నేమ్. ఆ పేరులోనే ఉంది.. ఇది మనిషిలోని ఊపిరితిత్తులకు సోకే వైరస్‌ అని. శ్వాసకోశాలకు వచ్చిందంటే.. సాధారణంగానే జలుబు, దగ్గు మొదలవుతుంది. జలుబు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. దగ్గు కారణంగా గొంతునొప్పి ఉంటుంది. ఈ జలుబు, దగ్గు వల్ల జ్వరం కూడా వస్తుంది.

HMPV Virus: ఎప్పుడో పుట్టిన వైరస్.. ఇప్పుడెందుకు పేట్రేగుతోంది..? HMPVకి అంత సీనుందా..
HMPV virus

Edited By: TV9 Telugu

Updated on: Jan 10, 2025 | 5:22 PM

తొలి కరోనా కేసు కేరళలో బయటపడినప్పుడు.. ఒక్కటే కదా అనుకున్నాం. ఆ సమయంలో కాస్త భయపడినా, ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. లక్షల మందిని పలకరించి వెళ్లింది. దాదాపు మూడేళ్ల పాటు తిష్టవేసింది కరోనా. ఇప్పుడు చైనాలో విభృంభిస్తున్న వైరస్.. ఇండియాను కూడా తాకింది. బయటపడ్డ కేసులు తక్కువే. దాని తీవ్రతా తక్కువే. అచ్చం తొలినాళ్లలో వచ్చిన కరోనాలా. మరి.. ఈ కొత్త వైరస్‌కు భయపడాలా వద్దా? ICMR గానీ, కేంద్ర ఆరోగ్య శాఖ గానీ.. అసలేం కంగారుపడొద్దంటోంది. వైద్యులు కూడా ఇదో సాధారణ జలుబు లాంటిదే అంటున్నారు. అయినా సరే.. భయపడకుండా ఉండాలా వద్దా? ఇప్పటి వరకైతే మరణాలు సంభవించినట్టుగా ఎక్కడా లేదు. కాని, పాతికేళ్ల hMPV హిస్టరీని చూసుకుంటే ఈ వైరస్‌ సోకిన వాళ్లు చనిపోలేదా అంటే.. చనిపోయారు కూడా. అలాంటప్పుడు.. భయపడాలా వద్దా? ఓవరాల్‌గా ఈ వైరస్‌ గురించి, దాని లక్షణాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ కథనంలో తెలుసుకోవచ్చు.. హ్యూమన్‌ మెటాన్యుమో వైరస్. ఇది HMPV ఫుల్‌ నేమ్. ఆ పేరులోనే ఉంది.. ఇది మనిషిలోని ఊపిరితిత్తులకు సోకే వైరస్‌ అని. శ్వాసకోశాలకు వచ్చిందంటే.. సాధారణంగానే జలుబు, దగ్గు మొదలవుతుంది. జలుబు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. దగ్గు కారణంగా గొంతునొప్పి ఉంటుంది. ఈ జలుబు, దగ్గు వల్ల జ్వరం కూడా వస్తుంది. HMPV వైరస్‌ వల్ల ఏమవుతుందని అడిగే వాళ్లకు ఇదీ సమాధానం. ఇక్కడ బాగా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి