HIV: వేధిస్తోన్న హెచ్ఐవీ మందుల కొరత.. భారత్ లో వైరస్ వ్యాప్తిపై ఆందోళనలు

|

Jul 01, 2022 | 8:57 PM

హెచ్ఐవీ (HIV) చికిత్సలో ఉపయోగించే డోలుటెగ్రావిర్ మందు కొరత వేధిస్తోంది. తద్వారా మహారాష్ట్ర, మిజోరాం, నాగాలాండ్‌లోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే యాంటీరెట్రోవైరల్ కేంద్రాల్లోని రోగులకు వీటి సరఫరా నిలిపివేశారు. రోగనిరోధక శక్తిని పోగొట్టే హ్యూమన్...

HIV: వేధిస్తోన్న హెచ్ఐవీ మందుల కొరత.. భారత్ లో వైరస్ వ్యాప్తిపై ఆందోళనలు
Hiv
Follow us on

హెచ్ఐవీ (HIV) చికిత్సలో ఉపయోగించే డోలుటెగ్రావిర్ మందు కొరత వేధిస్తోంది. తద్వారా మహారాష్ట్ర, మిజోరాం, నాగాలాండ్‌లోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే యాంటీరెట్రోవైరల్ కేంద్రాల్లోని రోగులకు వీటి సరఫరా నిలిపివేశారు. రోగనిరోధక శక్తిని పోగొట్టే హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) కు సమర్థవంతమైన చికిత్స లేదు. కానీ సరైన వైద్య సంరక్షణ, నిపుణుల సూచనతో హెచ్ఐవీని నియంత్రించవచ్చు. ముంబయికి చెందిన యునిసన్ మెడికేర్ & రీసెర్చ్ సెంటర్‌లో హెచ్‌ఐవీ, ఎస్‌టీడీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కన్సల్టెంట్ డాక్టర్ ఈశ్వర్ గిలాడా.. సరైన మందులతో హెచ్‌ఐవిని అరికట్టవచ్చని చెప్పారు. జాతీయ ఎయిడ్స్ (AIDS) నియంత్రణ సంస్థ వివరాల ప్రకారం.. అసురక్షిత లైంగిక సంబంధాల కారణంగా గడిచిన పదేళ్లలో దేశంలో 17 లక్షల మంది హెచ్‌ఐవీ బారినపడ్డారు. భారతదేశంలో గత దశాబ్ద కాలంలో హెచ్‌ఐవీ పరిస్థితి స్థిరంగా ఉందని, హైలీ యాక్టివ్ యాంటీ రెట్రోవైరల్ ట్రీట్‌మెంట్ (HAART) సులభంగా అందుబాటులో ఉండటంతో HIV రోగుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ సతీష్ కౌల్ చెప్పారు. వాస్తవానికి 2000 సంవత్సరం నుంచి, హెచ్ఐవీ సోకిన రోగుల ప్రాబల్యం తగ్గుతోందని వివరించారు.

అయితే.. హెచ్‌ఐవీ చికిత్సలో ఉపయోగించే డోలుటెగ్రావిర్ మందు లభ్యం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మందులను కొనుగోలు చేసేందుకు రసీదుల ఆధారంగా వాటి బిల్లులను చెల్లించాలని అధికార వర్గాలు నిర్ణయించాయి. కాగా.. హెచ్ఐవీ సరఫరాలో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తే సమస్య నుంచి బయటపడవచ్చు. మరో విషయం ఏమిటంటే.. ఈ ఔషధాన్ని కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే తయారు చేస్తున్నాయి. దానిని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు, ఇది సరఫరాకు ఆటంకం కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. డోలుటెగ్రావిర్‌తో పాటు అనేక ఇతర యాంటీరెట్రోవైరల్ ఔషధాలను NACO కొనుగోలు చేసి, ఉచితంగా సరఫరా చేస్తోంది.

డోలుటెగ్రావిర్ యొక్క ఒక టాబ్లెట్‌ను రూ. 6.67 ను కొనుగోలు చేస్తుండగా.. అదే టాబ్లెట్ ను మార్కెట్ లో రూ.117కు విక్రయిస్తున్నారు.
హెచ్‌ఐవీ బాధపడుతున్న రోగులు జీవితాంతం మందులు తీసుకోవాలి. ప్రస్తుతం భారత్ డోలుటెగ్రావిర్ మందును వినియోగిస్తోంది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, డీటీజీ ఔషధ నిరోధకతను అభివృద్ధి చేసేందుకు జన్యుపరమైన అవరోధాన్ని కలిగి ఉంది. ఈ ఔషధం వైరస్‌ విస్తరణను తగ్గించగలదు. కాంబినేషన్ ట్రీట్‌మెంట్‌లో మూడో ఏజెంట్‌గా ఉపయోగించే పాత యాంటీరెట్రోవైరల్ మందులతో పోలిస్తే, వైరల్ నియంత్రణలో డోలుటెగ్రావిర్ ఆధారిత మందులు మరింత మన్నికగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..