Historic Monument: భారీ వర్షాలకు కుప్పకూలిన 230 ఏళ్ల నాటి చారిత్రక కట్టడం..

|

Aug 16, 2022 | 8:25 AM

భారతదేశంలోని ఈ ఐకానిక్ హెరిటేజ్ భవనం సరైన నిర్వహణ గురించి హుస్సేన్ ధృవీకరించినప్పటికీ, కార్యకర్తలు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ లోపం కారణంగానే భవనం బలహీనపడిందని,..

Historic Monument: భారీ వర్షాలకు కుప్పకూలిన 230 ఏళ్ల నాటి చారిత్రక కట్టడం..
Bara Imambara
Follow us on

Historic Monument: భారీ వర్షాల కారణంగా 230 ఏళ్ల చరిత్ర కలిగిన బారా ఇమాంబర పారాపెట్ సోమవారం రాత్రి కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. స్మారక చిహ్నానికి సరైన నిర్వహణ ఉన్నప్పటికీ, భారీ వర్షాల కారణంగా పారాపెట్ పడిపోవడం దురదృష్టకరమని సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అఫ్తాబ్ హుస్సేన్ విచారం వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే సైట్ ఇన్‌ఛార్జ్ ప్రాంతాన్ని సందర్శించారు. ఇంజినీర్లు వెళ్లి నష్టాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వనున్నారు. ఆ తర్వాత పునరుద్ధరిస్తామన్నారు.

భారతదేశంలోని ఈ ఐకానిక్ హెరిటేజ్ భవనం సరైన నిర్వహణ గురించి హుస్సేన్ ధృవీకరించినప్పటికీ, కార్యకర్తలు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ లోపం కారణంగానే భవనం బలహీనపడిందని, ఇప్పుడు కూలిపోయే పరిస్థితికి దారితీసిందని వారు ఆరోపిస్తున్నారు. కట్టడం మరమ్మతులు చేపట్టాలని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు.

1784లో అవధ్ నవాబ్ అసఫ్-ఉద్-దౌలాచే లక్నోలో నిర్మించిన ఇమాంబర సముదాయాన్ని అసఫీ ఇమాంబరా అని కూడా పిలుస్తారు. ఈ ఇమాంబరా నిజామత్ ఇమాంబరా తర్వాత రెండవ అతిపెద్దది. బారా ఇమాంబర నిర్మాణం 1780లో ప్రారంభించబడింది. ఇది తీవ్రమైన కరువు ఏర్పడిన సంవత్సరం. ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభించడం ద్వారా అప్పటి కరువు కాలంలో దాదాపు ఒక దశాబ్దం పాటు ఈ ప్రాంతంలోని ప్రజలకు ఉపాధి కల్పించడం అసఫ్-ఉద్-దౌలా లక్ష్యాలలో ఒకటిగా పెట్టుకున్నారు. సాధారణ ప్రజలు భవనాన్ని నిర్మించడానికి పగటిపూట పని చేసేవారని, ప్రభువులు, ఇతర ఉన్నతవర్గాలు రాత్రిపూట పనిచేశారని చెబుతారు. ఇది ఉపాధి కల్పన కోసం కీనేసియన్ లాంటి జోక్యానికి ముందు ఉన్న ప్రాజెక్ట్‌గా చెబుతారు.

ఇవి కూడా చదవండి

ఇమాంబర నిర్మాణానికి అయ్యే అంచనా వ్యయం అర మిలియన్ రూపాయల నుండి లక్ష రూపాయల వరకు ఉంటుంది. పూర్తయిన తర్వాత కూడా, నవాబు దాని అలంకరణ కోసం సంవత్సరానికి నాలుగు నుండి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు చేసేవాడని సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి