అక్కడ మంగళవారం రోజు మటన్ షాపులు బంద్ చేయాలట.. ఓ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయంపై ఎంఐఎం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇష్టారీతిలో నిర్ణయం తీసుకోవడానికి మీరెవరు అని ప్రశ్నిస్తున్నారు.
హర్యానాలోని గుర్గావ్‌లో తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర వివాదం రేపుతోంది. మంగళవారం రోజు మటన్ షాపులు బంద్ చేయాలని అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. అయితే దీనిపై మజ్లిస్ నేతలు మండిపడుతున్నారు. మటన్ షాపులు బంద్ చేయడానికి మీరెవరని ప్రశ్నిస్తున్నారు. ఏ రోజు ఏం తినాలో మీరే నిర్ణయిస్తారా ? అని ప్రశ్నిస్తున్నారు.
మంగళవారం మీకు పవిత్రమైన రోజైతే.. శుక్రవారం మాకు పవిత్రమైన రోజని, ఆ రోజు వైన్‌షాపులు బంద్ చేస్తారా ? అని ప్రశ్నిస్తున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. అసలు ఏ రోజు.. ఏం తినాలో నిర్ణయించడానికి మీరు ఎవరని, ఘాటుగా స్పందించారు. అంతేకాదు గుర్గావ్‌లోని ఫైవ్‌స్టార్ హోటళ్లలో కూడా మంగళవారం రోజు మటన్ ఉంటుందో..లేదో చెప్పాలని అక్కడి మున్సిపల్ కార్పొరేషన్‌ని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుని తమ మనోభావాలను దెబ్బతీయొద్దని మజ్లిస్ నేతలు మండిపడుతున్నారు. మటన్ షాపులు అధికంగా ముస్లింలే నిర్వహిస్తుంటారు. దీంతో వారంలో ఒక రోజు పూర్తిగా మటన్ షాపులను బంద్ చేయడం వల్ల రోజువారీగా మటన్ షాపుల ఆధారంగా బతుకుబండి లాగించేవారు తీవ్రంగా నష్టపోతారని మజ్లిస్ నేతలు భావిస్తున్నారు. అందుకే గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు.
Also Read: TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయం