Sadhvi Prachi: హిందూ అమ్మాయిల పర్సలో ఉండాల్సింది లిప్‌స్టిక్‌ కాదు.. కత్తి: సంచలన వ్యాఖ్యలు చేసిన సాధ్వి

విశ్వహిందూ పరిషత్‌ నాయకురాలు సాధ్వి ప్రాచీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ అమ్మాయిలు తమ పర్సులో లిప్‌స్టిక్స్‌, దువ్వెన కాదని.. కత్తిని ఉంచుకోవాలని సూచించారు...

Sadhvi Prachi: హిందూ అమ్మాయిల పర్సలో ఉండాల్సింది లిప్‌స్టిక్‌ కాదు.. కత్తి: సంచలన వ్యాఖ్యలు చేసిన సాధ్వి
Sadhvi Prachi

Updated on: Feb 15, 2023 | 10:37 PM

విశ్వహిందూ పరిషత్‌ నాయకురాలు సాధ్వి ప్రాచీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ అమ్మాయిలు తమ పర్సులో లిప్‌స్టిక్స్‌, దువ్వెన కాదని.. కత్తిని ఉంచుకోవాలని సూచించారు. దీంతో హిందూ అమ్మాయిల వద్దకు జీహాదీలు రాలేదని ఆమె అమ్మాయిలకు సూచించారు. జీహాదీల ఆటకట్టించాలంటే ఇదే సరైన మార్గమని అన్నారు. బుధవారం ఆమె మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో మీడియా ముందు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

ముస్లింలు తమ మతం కోసం ఏవిధమైన కట్టుబాట్లు అనుసరిస్తున్నారో అదే విధంగా హిందువులు కూడా సాంప్రదాయబద్ధంగా ఉండాలని అన్నారు. ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ దారుణ హత్య కేసును ప్రస్తావిస్తూ జీహాదీలు మీ తలను పట్టికెళ్లేందుకు సిద్ధపడితే, దానికి ముందే మీరు వారి గొంతులను కత్తులతో కత్తిరించాలన్నారు. సాధ్వి ప్రాచీ స్థానిక అనాది కల్పేశ్వరర్ ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా జమాతే ఉలేమా-ఇ-హింద్ చీఫ్ మౌలానా అర్షగ్ మదాని ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆమె మాట్లాడారు. మదానీకి హిందూయిజం గురించి ఏబీసీడీలు కూడా తెలియవని భారతదేశం అంటే హిందూ దేశమని, భవిష్యత్తులో కూడా హిందూ దేశంగానే ఉంటుందని వ్యాఖ్యానించారు. మదానీ వ్యాఖ్యలకు నిరసనగా జైన్ ఆచార్య లోకేష్ ముని, ఇతర సాధువులు జమాతేను బాయ్‌కాట్ చేయడం సరైనదే చర్యేనని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి