కాంగ్రెస్‌ నేత హిమాని హత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. వెలుగులోకి సంచలనం!

హర్యానాలో మహిళా కాంగ్రెస్‌ నేత హిమాని మర్డర్‌ కేసు ఊహించని మలుపు తిరిగింది. పార్టీలో ఆమె ఎదుగుదలను చూసి కాంగ్రెస్‌ నేతలే హత్య చేయించారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మర్డర్‌పై ఉన్నతస్థాయి దర్యాప్తుకు కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలను పోలీసులు బయటపెట్టారు.

కాంగ్రెస్‌ నేత హిమాని హత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. వెలుగులోకి సంచలనం!
Cctv Footage Captures Accused Sachin

Updated on: Mar 04, 2025 | 7:58 AM

హర్యానాలో మహిళా కాంగ్రెస్‌ నేత హిమాని మర్డర్‌ కేసు ఊహించని మలుపు తిరిగింది. పార్టీలో ఆమె ఎదుగుదలను చూసి కాంగ్రెస్‌ నేతలే హత్య చేయించారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మర్డర్‌పై ఉన్నతస్థాయి దర్యాప్తుకు కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలను పోలీసులు బయటపెట్టారు.

కాంగ్రెస్ కార్యకర్త హిమాని నర్వాల్ మృతదేహాన్ని నింపిన సూట్‌కేస్‌ను నిందితుడు సచిన్ తీసుకెళ్తున్నట్లు సోమవారం(మార్చి 3) అధికారులు CCTV ఫుటేజ్‌ను విడుదల చేశారు. హర్యానా కాంగ్రెస్ కార్యకర్తను సచిన్ అనే నిందితుడు మొబైల్ ఛార్జర్ వైర్‌తో హత్య చేసి, ఆమె మృతదేహాన్ని రోహ్‌తక్‌లోని సంప్లా బస్టాండ్ సమీపంలోని హైవేపై సూట్‌కేస్‌లో పడేశాడు. ఈ మృతదేహం ఉన్న సూట్‌కేస్‌ను లాగుతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్న వ్యక్తి సచిన్ అని, అరెస్టు చేసిన తర్వాత అతను తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు నిర్ధారించారు.

దర్యాప్తు పూర్తి అయిన తర్వాత పోలీసులు నేర వివరాలను వెల్లడించారు. హర్యానాలోని రోహ్‌తక్‌లోని విజయ్ నగర్ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసంలో గురువారం (ఫిబ్రవరి 27) జరిగిన గొడవ తర్వాత 32 ఏళ్ల సచిన్ హిమాని నర్వాల్(22) ను మొబైల్ ఫోన్ ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి చంపాడని పోలీసులు తెలిపారు. సాంప్లా బస్ స్టాండ్ సమీపంలోని హైవేపై మృతురాలి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో వేసి పడేసి అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. అయితే, నిందితుడు మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి ఈడ్చుకుంటూ వెళ్తుండగా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో చిక్కుకుంది. ఆ తర్వాత పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్త హిమాని నర్వాల్ స్నేహితుడు అయిన సచిన్, రోహ్తక్‌లోని ఆమె ఇంట్లో జరిగిన గొడవ తర్వాత వైర్డు మొబైల్ ఛార్జర్‌తో ఆమెను గొంతు కోసి చంపి, ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో తీసుకెళ్లి పడేసిన కేసులో మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు.

హర్యానాలో సంచలనం సృష్టించిన మహిళా కాంగ్రెస్‌ నేత హిమాని నర్వాల్‌ హత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగు లోకి వస్తున్నాయి. అయితే హిమాని హత్య వెనుక కాంగ్రెస్‌ నేతల ప్రమేయం ఉండవచ్చని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పార్టీలో ఆమె ఎదుగుదలను చూసి చాలామంది ఓర్వడం లేదని హిమాని తల్లి సవిత ఆరోపించారు. భారత్‌ జోడో యాత్రలో హిమాని 10 రోజుల పాటు పాల్గొన్నారని తెలిపారు. కశ్మీర్‌లో కూడా లాల్‌చౌక్‌ వరకు పాదయాత్రలో పాల్గొన్నారని వెల్లడించారు. హిమాని హత్యపై మాజీ సీఎం భూపేందర్‌సింగ్‌ హుడా , ఎంపీ దీపేందర్‌సింగ్‌ తమతో ఫోన్లో ఇప్పటివరకు మాట్లాడలేదని ఆరోపించారు సవిత. కార్యకర్తలను కూడా ఎంతో బాగా చూసుకున్న తన కూతురిని ఇలా హత్య చేయడం దారుణమన్నారు. హిమాని గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందని నా సోదరి హత్యకు న్యాయం చేయాలని తాను అందరికీ చేతులెత్తి మొక్కుతున్నానని ఏడుస్తూ.. మీడియా ద్వారా హిమాని సోదరుడు జతిన్ విజ్ఙప్తి చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..