Viral Video: హిమాచల్‌ ప్రదేశ్‌లో గడ్డకట్టిపోయిన కులూ వాటర్‌ ఫాల్‌.. మంచు తోరణాల్లా మారిన జలపాతం

|

Jan 10, 2023 | 10:46 AM

అతి శీతల వాతావరణంతో ఎత్తునుంచి పడుతున్న ఆ నీరు గడ్డకట్టి మంచు తోరణాలను తలపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Viral Video: హిమాచల్‌ ప్రదేశ్‌లో గడ్డకట్టిపోయిన కులూ వాటర్‌ ఫాల్‌..  మంచు తోరణాల్లా మారిన జలపాతం
Kullu Waterfall
Follow us on

మొన్నటి వరకూ ఎక్కడో అమెరికాలో మంచు తుఫాను, శీతలగాలుల ప్రభావంతో నదులు గడ్డకట్టిపోవడం చూశాం. కానీ ఇప్పుడు ఇండియాలోనే అలాంటి పరిస్థితి నెలకొంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలుపడిపోతున్నాయి. చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉత్తర భారత్‌లో అయితే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దట్టమైన పొగమంచుతో రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమాన ప్రయాణాలకు సైతం ఆటంకం కలుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 9న అత్యల్పంగా 3.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రేంజ్‌లో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో నీరు గడ్డకట్టుకుపోతోంది.

హిమాచల్‌లో అయితే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోతుండటంతో నీళ్లు గడ్డకట్టుకుపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. హిమాచల్‌ కులూలోని ఓ జలపాతం గడ్డకట్టుకుపోయింది. అతి శీతల వాతావరణంతో ఎత్తునుంచి పడుతున్న ఆ నీరు గడ్డకట్టి మంచు తోరణాలను తలపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

మంచు శిల్పాలుగా మారిన జలపాతం చూపరులను ఆకట్టుకుంటోంది. గడ్డకట్టిన జలపాతం అందాలను చూసి పర్యాటకులు ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గట్టకట్టిన జలపాతం అందాలు నెట్టింట కనువిందుచేస్తున్నాయి. మంచు గోడలను చూసి నెటిజన్లు ముగ్దులవుతున్నారు.