కేసు విచారణను ఆపాలంటూ స్టే కోరిన ముఖ్యమంత్రి.. షాకిచ్చిన హైకోర్టు.. భారీగా జరిమానా విధింపు..

Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూర్పకు ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓ కేసుపై విచారణ చేపట్టొద్దంటూ పిటిషన్..

కేసు విచారణను ఆపాలంటూ స్టే కోరిన ముఖ్యమంత్రి.. షాకిచ్చిన హైకోర్టు.. భారీగా జరిమానా విధింపు..
Follow us

|

Updated on: Jan 06, 2021 | 11:20 AM

Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూర్పకు ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓ కేసుపై విచారణ చేపట్టొద్దంటూ పిటిషన్ దాఖలు చేసినందుకు ఆయనకు రూ.25వేల జరిమానా విధించింది. వివరాల్లోకెళితే.. బెంగళూరు సమీపంలోని గంగేనహళ్లిలో 1.11 ఎకరాల భూమి డీనోటిఫికేషన్‌ చేయడంలో అవినీతి ఉందని ఆరోపిస్తూ 2015లో హైకోర్టు సంచార బెంచ్‌లో సామాజిక కార్యకర్త జయకుమార్ హీరేమఠ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ భూమిని డీనోటిఫికేషన్ చేయడం ద్వారా యడియూరప్ప లబ్ధి పొందారని పిటిషనర్ తన పిటీషన్‌లో ఆరోపించారు. అంతేకాదు.. దీని ద్వారా మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి బంధువులకు కూడా మేలు జరిగిందని ఆయన ఆరోపించారు. తాజాగా కేసు హైకోర్టు విచారణకు రాగా.. దర్యాప్తు చేపట్టాలంటూ లోకాయుక్తను ఆదేశించింది. అయితే, దర్యాప్తు నిలిపివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి యడియూరప్ప కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మైఖేల్ డి కున్షా.. సీఎం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు రూ. 25వేల జరిమానా విధించింది.

Also read:

రష్యాతో ఆ డీల్ కుదుర్చుకుని ఆచరణలో పెడితే, ఇండియాకు అమెరికా హెచ్ఛరిక, ఆంక్షలు తప్పవు రష్యా

Telangana Corona Bulletin: తెలంగాణలో పెరిగిన కరోనా కేసుల సంఖ్య.. ఒక్క రోజులో 417 కేసులు నమోదు.. ఇద్దరు మృతి..