Ratan Tata: ఇది కదా.. అసలైన గొప్పతనం.. రతన్ టాటా ఔన్నత్యానికి సెల్యూట్ చేయాల్సిందే..
Ratan Tata visit unwell ex-employee: జీవితంలో గెలవడం అంటే డబ్బులు సంపాదించడం... చాలా మంది ఆలోచించేది ఇదే. ఎంతలా అంటే..
Ratan Tata visit unwell ex-employee: జీవితంలో గెలవడం అంటే డబ్బులు సంపాదించడం… చాలా మంది ఆలోచించేది ఇదే. ఎంతలా అంటే కనీసం మానవత్వాన్ని మరుస్తూ… పక్కన ఉన్న వారిని కూడా పట్టించుకోలేనంతలా. ఇలా మానవ జీవితం యాంత్రికంగా మారుతోంది. పక్క వాడు ఏమైపోతే నాకేంటి అనే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా చేసిన ఓ పని.. మానవత్వం ఇంకా బతికే ఉందని చాటిచెప్పింది.
ఆయన దేశంలోనే ఒక బడా వ్యాపార వేత్త. సంపదను సృష్టించడంలో ఆయనకు ఆయనే సాటి.. అయితే మానవత్వాన్ని చాటుకోవడంలోనూ ఆయనకు ఎవరూ సాటిలేరని నిరూపించారు. అతనే భారత దేశానికి చెందిన గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన రతన్ టాటా. తమ కంపెనీలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి గత రెండేళ్లుగా అనారోగ్యంతో ఉన్నారని తెలుసుకున్న రతన్ టాటా స్వయంగా సదరు ఉద్యోగి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇందుకోసం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ముంబై నుంచి పుణె వెళ్లిన రతన్ అనారోగ్యం బారిన పడిన ఉద్యోగిని పరాపర్శించి ఆమెకు భరోసా ఇచ్చారు. తమ కంపెనీలో పనిచేసిన ఓ ఉద్యోగి పట్ల రతన్ చూపించిన ఔన్నత్యాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. రతన్ టాటా పుణె పర్యాటనలో భాగంగా కనీసం బౌన్సర్లు, మీడియా కూడా హాజరుకాకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. తమ ఉద్యోగులు ఏమైపోతే మాకేంటి అని అనుకుంటోన్న ఇలాంటి రోజుల్లో మాజీ ఉద్యోగి పట్ల ఇంత మార్యాదతో ఉండడం నిజంగా ఎంతో గొప్ప విషయం కదూ..!
Also Read: ISRO Scientist Tapan Misra: ‘నాకు విషం పెట్టి చంపాలని చూశారు’… ఇస్రో శాస్త్రవేత్త సంచలన వ్యాఖ్యలు..