ISRO Scientist Tapan Misra: ‘నాకు విషం పెట్టి చంపాలని చూశారు’… ఇస్రో శాస్త్రవేత్త సంచలన వ్యాఖ్యలు..
ISRO Scientist Tapan Misra: టిఫిన్‌లో విషం పెట్టి కొందరు తనను చంపాలని చూశారంటూ ఇస్రోలోని ప్రముఖ శాస్త్రవేత్త తపన్ మిశ్రా..
ISRO Scientist Tapan Misra: టిఫిన్‌లో విషం పెట్టి కొందరు తనను చంపాలని చూశారంటూ ఇస్రోలోని ప్రముఖ శాస్త్రవేత్త తపన్ మిశ్రా సంచలన కామెంట్స్ చేశారు. సరిగ్గా మూడేళ్ల క్రిందట తనపై విష ప్రయోగం చేశారని.. చంపేందుకు కుట్ర పన్నారని తెలిపారు. 2017, మే 23న బెంగళూరు ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో డేంజరస్ ఆర్సెనిక్ ట్రైయాక్సైడ్‌ను తాను తిన్న దోసతో పాటు చట్నీలో కలిపారని తపన్ మిశ్రా ఆరోపించారు.
అది తినడం వల్ల చర్మ వ్యాధి, ఫంగల్ ఇన్ఫెక్షన్, శ్వాస ఇబ్బందిని ఎదుర్కుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ అంశంపై జూలై 2017లో కేంద్ర హోం వ్యవహారాల భద్రతా సిబ్బంది తనను కలిశారని.. ఆర్సెనిక్ గురించి అప్రమత్తం చేయడమే కాకుండా దాని నివారణపై దృష్టి సారించాలని వైద్యులకు సహకరించారని తపన్ శర్మ పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని కోరారు.
కాగా, ప్రస్తుతం ఇస్రోలో మిశ్రా సీనియర్ సలహాదారుగా పని చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన మిలటరీ వాడే సింథటిక్ రాడార్ల తయారీలో కీలక నిపుణులుగా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు అహ్మదాబాద్‌కు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్‌గా పని చేశారు.
Also Read:
కరోనా వ్యాక్సిన్.. జనవరి 13 నుంచి దేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం..!
మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాయే కాదు..
ఆసుపత్రుల్లోని గాలిలో కరోనా వైరస్.. సీసీఎంబీ రీసెర్చ్‌లో సంచలన విషయాలు వెల్లడి.!