Heroin Seized: ముంబైలో రూ.300 కోట్ల విలువ చేసే భారీగా హెరాయిన్‌ పట్టివేత.. డీఆర్‌ఐ అధికారుల అదుపులో ఇద్దరు

|

Jul 03, 2021 | 6:44 AM

Heroin Seized: దేశంలో భారీగా అక్రమ డ్రగ్స్‌ దందా కొనసాగుతోంది. పోలీసులు అక్రమ డ్రగ్స్‌పై కొరఢా ఝులిపించినా.. ఇంకా అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. తాజాగా.

Heroin Seized: ముంబైలో రూ.300 కోట్ల విలువ చేసే భారీగా హెరాయిన్‌ పట్టివేత.. డీఆర్‌ఐ అధికారుల అదుపులో ఇద్దరు
Follow us on

Heroin Seized: దేశంలో భారీగా అక్రమ డ్రగ్స్‌ దందా కొనసాగుతోంది. పోలీసులు అక్రమ డ్రగ్స్‌పై కొరఢా ఝులిపించినా.. ఇంకా అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. తాజాగా ముంబైలో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు  డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) . 300 కోట్ల రూపాయల విలువ చేసే 290 కిలోల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా  డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే దేశంలో డ్రగ్స్‌ దందాపై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒక వైపు ఇలాంటి డ్రగ్స్‌ దందాను రూపుమాపేందుకు పోలీసులు, అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నా.. మరోవైపు అక్రమ డ్రగ్స్‌ సరఫరా కొనసాగుతూనే ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Fire Accident: కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం.. సినిమా థియేటర్‌లో చెలరేగిన మంటలు.. ఘటన స్థలానికి 15 ఫైరింజన్లు

Road Accident: జమ్మూకశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం.. రెండు వాహనాలు ఢీకొని లోయలో పడ్డ వాహనం.. ఐదుగురు మృతి