Gujarat Drug Seizure: గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో డ్రగ్స్ కలకలం రేపింది. పోర్టు సమీపంలో గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) జరిపిన సోదాల్లో ఒక కంటైనర్‌లో భారీగా హెరాయిన్ పట్టుబడింది. పట్టుబడ్డ హెరాయిన్ దాదాపు 75 కిలోలు ఉంటుందని, దీని విలువ రూ.350కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, పట్టుబడ్డ హెరాయిన్ పరిమాణం, విలువ ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గత కొన్ని రోజులుగా గుజరాత్‌లోని పలు పోర్టుల్లో నిషిద్ధ మత్తు పదార్ధాలను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకుంటున్నారు. ఏటీఎస్‌కు వచ్చిన సమాచారం ఆధారంగా కంటైనర్‌లో సోదాలు జరపడంతో భారీగా హెరాయిన్ పట్టుబడింది. కొంత కాలం క్రితం వేరే దేశం నుండి వచ్చిన ఈ కంటైనర్‌ను పోర్టు బయట కంటైనర్ ఫ్రైట్ స్టేషన్‌లో అధికారులు గుర్తించారు. గత కొంత కాలంగా వివిధ రాష్ట్రాల, కేంద్ర సంస్థలు, ఏటీఎస్ మరియు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) కోట్లాది రూపాయలు విలువ చేసే అక్రమ, కంటైనర్‌లను గుజరాత్ పోర్టుల్లో స్వాధీనం చేసుకున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి