
గత 11 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ తన సంస్కృతి, సంప్రదాయాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసింది. ప్రాచీన ఆలయాలు, సంస్కృతి, ఆధ్యాత్మికతను పునరుద్ధరిస్తూ.. వాటిని కొత్త తరాలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. హంపి వంటి చారిత్రక ప్రదేశాల నుంచి.. సంగీతం, నృత్యం వంటి కళల వరకు, భారత సంస్కృతిని గౌరవిస్తూ ప్రగతి సాధించింది.
| ప్రదేశం/ప్రాజెక్టు | చేపట్టిన పనులు |
|---|---|
| కాశీ విశ్వనాథ్ కారిడార్ | వారణాసిలోని పుణ్యక్షేత్రాలకు మెరుగైన మార్గాలు, నూతన సౌకర్యాలు కల్పించారు |
| మహాకాల్ లోక్ ప్రాజెక్టు | మహాకాళేశ్వర్ ఆలయానికి కొత్త సౌకర్యాలు, పర్యాటక అనుభవం మెరుగుపరిచారు. |
| రామ మందిరం, అయోధ్య | ఆగస్టు 2020లో భూమిపూజ; 2024లో గ్రాండ్ రామాలయ నిర్మాణం. |
| కేదార్‌నాథ్ ఆలయం | ఆదిశంకరాచార్య విగ్రహం ప్రతిష్టించి పుణ్యక్షేత్రానికి ప్రాచీనతను చేర్చారు. |
| సోమనాథ్ ఆలయం | ఆలయానికి సముద్రదృశ్య ప్రామెనేడ్, కొత్త సౌకర్యాలు. |
చార్ ధామ్ హైవే: యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్, కైలాష్-మానససరోవర్ యాత్ర మార్గాన్ని కలుపుతూ 5 NHల అప్‌గ్రేడ్ (మొత్తం 825 కి.మీ; 616 కి.మీ. జులై 2024 నాటికి పూర్తయింది).
హేమ్‌కుండ్ సాహిబ్ రోప్‌వే: ఉత్తరాఖండ్‌లోని గోవింద్‌ఘాట్ నుండి హేమకుండ్ సాహిబ్ జీ వరకు 12.4 కిమీ రోప్‌వే ఆమోదించబడింది; ప్రాజెక్ట్ వ్యయం రూ 2,730.13 కోట్లు.
కర్తార్పూర్ కారిడార్: భారతీయ సిక్కులకు పాకిస్తాన్‌లోని గుడ్వారాను సందర్శించే వెసులుబాటు
PRASHAD పథకం: ఆలయాలు, పుణ్యక్షేత్రాలకు కొత్త సౌకర్యాలు. ఇందుకోసం దాదాపు రూ. 1900 కోట్లు వెచ్చించారు
స్వదేశ దర్శన్: పర్యాటక మార్గాలను అభివృద్ధి చేయడం. ఫేజ్ 1 కింద 76 ప్రాజెక్టులకు రూ.5,292.91 కోట్లు మంజూరు చేశారు. స్వదేశ్ దర్శన్ 2.0 కింద 34 కొత్త ప్రాజెక్టులను ఆమోదం లభించింది.
HRIDAY పథకం: 12 చారిత్రక నగరాల అభివృద్ధి.
విదేశీ పర్యాటకులు: 9.66 మిలియన్
విదేశీ మారకద్రవ్య ఆదాయం: రూ 2,77,842 కోట్లు
ఈ కార్యక్రమాలు భారతీయ సంప్రదాయాలు వెల్లవిరిసేందుకు, ప్రపంచానికి భారత ఆధ్యాత్మికతను పరిచయం చేసేందుకు ఉపయోగపడుతున్నాయి.