Weather: దేశంలోకి రుతుపవనాలు.. రాగ‌ల 5 రోజుల్లో భారీ వ‌ర్షాలు.. తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక!

|

Jun 19, 2022 | 7:52 AM

నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలో విస్తరిస్తున్న క్రమంలో అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

Weather: దేశంలోకి రుతుపవనాలు.. రాగ‌ల 5 రోజుల్లో భారీ వ‌ర్షాలు.. తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక!
Follow us on

నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలో విస్తరిస్తున్న క్రమంలో అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌‌ ఉందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్‌‌,​ ఆసిఫాబాద్‌‌, మంచిర్యాల, నిర్మల్‌‌, నిజామాబాద్‌‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌‌, యాదాద్రి, మల్కాజిగిరి, మహబూబ్‌‌నగర్‌‌, నాగర్‌‌ కర్నూల్‌‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నిజామాబాద్​లోని జక్రాన్‌‌పల్లిలో 7, మదనపల్లెలో 5.5, గద్వాలలోని ధరూర్​లో 5, నల్గొండలోని కనగల్‌‌లో 4, సంగారెడ్డిలోని రాయికోడ్‌‌లో 3.9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయ్యింది.

అటు, దేశరాజధాని ఢిల్లీలోనూ వాతావరణం చల్లబడింది. తొలికరి వర్షాలతో ప్రజలు మండుతున్న వేడి నుండి ఉపశమనం పొందారు. రానున్న 24 గంటల్లో మరికొన్ని రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశించవచ్చని ఐఎండీ తెలిపింది. కేరళ మీదుగా దేశంలోకి ప్రవేశించిన రుతుపవనాలు కోల్‌కతాకు చేరుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అదే సమయంలో, చాలా రాష్ట్రాల్లో రుతుపవనాలకు ముందు వర్షాలు కురుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 32.7 డిగ్రీల సెల్సియస్‌గా ఉండటంతో శనివారం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఢిల్లీలో జూన్ 21 వరకు ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఆదివారం గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 32, 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 24.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది, ఇది సగటు కంటే 4 డిగ్రీలు తక్కువగా నమోదైంది.